Jio రూ.419 ప్రీపెయిడ్ ప్లాన్: 5G డేటాతో పాటు, JioTv, JioCinema వంటి మరెన్నో బెనిఫిట్స్

Highlights

  • ఎన్నో వాల్యూ ఫర్ మనీ ప్లాన్స్ అందిస్తోన్న రిలయన్స్ జియో
  • రూ.419 ప్లాన్ తో కస్టమర్ కి లభించనున్న డేటా, వ్యాలిడిటీ, ఎస్ఎంఎస్ బెనిఫిట్స్
  • రూ.419 ప్లాన్ తో లభించే అదనపు ప్రయోజనాలు: జియో టీవీ, జియో సినిమా, జియో సెక్యూరిటీ, జియో క్లౌడ్

భారతదేశంలో ఉన్న టెలీకామ్ కంపెనీల్లో అగ్రస్థానంలో కొనసాగుతోంది రిలయన్స్ జియో. వాల్యూ ఫర్ మనీ ప్లాన్స్ కి కేరాఫ్ అడ్రస్ జియో. ఒకవైపు వేగవంతమైన 5జీ టెక్నాలజీ, మరోవైపు సరసమైన ధరలు, వెరసి జియోని సబ్‌స్క్రైబర్స్ మొదటి చాయిస్ గా నిలబెట్టాయి. ఎయిర్టెల్ తో గట్టి పోటీ ఉన్నప్పటికీ జియో తన ఆదిపత్యాన్ని కొనసాగిస్తోంది.

ఇటీవలె ట్రాయ్ విడుదల చేసిన సబ్‌స్క్రైబర్స్ ట్యాలీ లిస్ట్ లో అత్యధిక యూజర్లను రాబట్టిన జియో తనకు తిరుగులేదని మరొకసారి నిరూపించింది. సమీప పోటీదారు అయిన ఎయిర్టెల్ కూడా కొత్తగా యూజర్లను పెంచుకుని రెండో స్థానంలో నిలిచింది. ఇక ఎప్పటిలాగే వొడాఫోన్ ఐడియా సంస్థ భారీ సంఖ్యలో యూజర్లను కోల్పోయి చతికిలపడింది. ఇక బీఎస్ఎన్ఎల్ ప్రస్తుతం 4జీ, 5జీ కి అప్‌గ్రేడ్ అయ్యే పనిలో పడింది.

ఈ ఆర్టికల్ లో మనం జియో అందిస్తోన్న రూ.419 ప్లాన్ గురించి తెలుసుకుందాం. ఈ ప్లాన్ ద్వారా యూజర్ కి అద్భుతమైన బెనిఫిట్స్ లభిస్తాయి. రూ.419 ప్లాన్ రీచార్జ్ చేసుకునే కస్టమర్లకు డేటా, వ్యాలిడిటీ, ఎస్ఎంఎస్, అన్‌లిమిటెడ్ కాలింగ్ తో పాటు ఇంకా అదనపు ప్రయోజనాలు కూడా లభిస్తాయి. సరే, ఓసారి రూ.419 ప్లాన్ అందించే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం పదండి.

Jio రూ.419 ప్రీపెయిడ్ ప్లాన్ ప్రయోజనాలు

  • 28 రోజుల వ్యాలిడిటీ
  • 3జిబి డెయిలీ డేటా
  • డెయిలీ 100 ఎస్ఎంఎస్
  • అపరిమిత కాలింగ్ సౌకర్యం

జియో సంస్థ తన యూజర్ల కోసం తీసుకొచ్చిన రూ.419 ప్రీపెయిడ్ ప్లాన్ ద్వారా 28 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. ఇంకా ప్రతి రోజూ 3జిబి డేటా లభిస్తుంది. రోజూ అత్యధిక డేటాను వాడే వారికి ఇది సరైన ఎంపిక. అలాగే డెయిలీ 100 ఎస్ఎంఎస్ లభిస్తాయి. ఇంకా ఏ నెట్వర్క్ కి అయినా అపరిమిత కాలింగ్ సౌకర్యం లభిస్తుంది. 3జిబి హై-స్పీడ్ డేటా వినియోగం అనంతరం, డేటా స్పీడ్ 64కేబీపీఎస్ కి పడిపోతుంది. ఈ స్పీడుతో ఇంటర్నెట్ బ్రౌజింగ్ చేసుకునే వీలుంటుంది. అర్హత గల సబ్‌స్క్రైబర్లకు అన్‌లిమిటెడ్ 5జీ డేటా లభిస్తుంది.

రూ.419 ప్రీపెయిడ్ ప్లాన్ అదనపు ప్రయోజనాలు

  • జియో టీవీ
  • జియో సినిమా
  • జియో సెక్యూరిటీ
  • జియో క్లౌడ్

జియో అందిస్తోన్న రూ.419 ప్లాన్ ద్వారా కస్టమర్ కి అదనంగా జియో ఎక్స్‌క్లూజివ్ ప్రయోజనాలు లభించనున్నాయి. జియో టీవీ, జియో సినిమా, జియో సెక్యూరిటీ, జియో క్లౌడ్ సర్వీసెస్ కి ఉచిత యాక్సెస్ యూజర్ కి లభిస్తుంది.

జియో అందిస్తోన్న రూ.419 ప్లాన్ గురించి ఒకటికి రెండుసార్లు చదివి తెలుసుకుని, మీకు సరిపడేదైతే రీచార్జ్ చేసుకుని బెనిఫిట్స్‌ని ఎంజాయ్ చేయండి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.