Jio రూ.209 ప్లాన్: JioTv, JioCinema తో పాటు మరెన్నో బెనిఫిట్స్

Highlights

  • ఎన్నో వాల్యూ ఫర్ మనీ ప్లాన్స్ ని అందిస్తోన్న రిలయన్స్ జియో సంస్థ
  • రూ.209 ప్రీపెయిడ్ ప్లాన్ తో డేటా, కాల్స్, ఎస్ఎంఎస్, వ్యాలిడిటీతో పాటు మరెన్నో బెనిఫిట్స్
  • జియో టీవీ, జియో సినిమా, జియో సెక్యూరిటీ, జియో క్లౌడ్ వంటి అదనపు ప్రయోజనాలు యూజర్ సొంతం

భారతదేశంలో ఉన్న టాప్ టెలీకామ్ సంస్థల్లో జియో ఒకటి. ప్రస్తుతం సబ్‌స్క్రైబర్స్ పరంగా, 5జీ నెట్వర్క్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ విషయంలో జియో సంస్థ దేశంలోనే నెం.1 స్థానంలో ఉంది. మరొక దిగ్గజ సంస్థ ఎయిర్టెల్ నుంచి జియో గట్టి పోటీ ఎదురవుతోంది. అయితే జియో తన వద్ద ఉన్న అద్భుతమైన వాల్యూ ఫర్ మనీ ప్లాన్స్ తో యూజర్లను ఆకట్టుకుంటోంది.

జియో అందిస్తోన్న రూ.209 ప్రీపెయిడ్ ప్లాన్ నెలవారీ రీచార్జ్ చేసుకునే వారికి ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. ఈ ప్లాన్ ద్వారా యూజర్ కి 28 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. హైస్పీడ్ డేటా, ఎస్ఎంఎస్, అన్‌లిమిటెడ్ కాలింగ్ వంటి ప్రయోజనాలు ఈ ప్లాన్ ద్వారా లభిస్తాయి. ఇంకా అదనపు ప్రయోజనాలు కూడా లభిస్తాయి. ఓసారి రూ.209 ప్రీపెయిడ్ ప్లాన్ ద్వారా లభించే బెనిఫిట్స్ ఏంటో తెలుసుకుందాం పదండి.

Jio రూ.209 ప్రీపెయిడ్ ప్లాన్ ప్రయోజనాలు

  • 28 రోజుల వ్యాలిడిటీ
  • డెయిలీ 1జిబి హై-స్పీడ్ డేటా
  • డెయిలీ 100 ఎస్ఎంఎస్
  • అపరిమిత ఉచిత కాలింగ్

రిలయన్స్ జియో సంస్థ అందిస్తోన్న రూ.209 ప్రీపెయిడ్ ప్లాన్ ద్వారా ఎన్నో లాభాలున్నాయి. ఈ ప్లాన్ ని రీచార్జ్ చేసే కస్టమర్ కి 28 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. ఇంకా ప్రతిరోజూ 1జిబి హై-స్పీడ్ డేటా లభిస్తుంది. అంటే మొత్తం 28 రోజులకు గాను 28జిబి డేటా లభిస్తుంది. ఇంకా ఏ నెట్వర్క్ కి అయినా లోకల్, ఎస్టీడీ కాల్స్ ఉచితంగా మాట్లాడుకోవచ్చు.

ఇంకా రూ.209 ప్లాన్ ద్వారా డెయిలీ 100 ఎస్ఎంఎస్ లు లభిస్తాయి. 100 ఎస్ఎంఎస్ పరిధి దాటాక సాధారణ చార్జీలు వర్తిస్తాయి. ఇక ప్రతిరోజూ లభించే 1జిబి డేటా వినియోగం తర్వాత, డేటా వేగం 64కేబీపీఎస్ కి పడిపోతుంది. అయినప్పటికీ మీరు ఇంటర్నెట్ బ్రౌజింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అంతేకాదండోయ్, ఈ ప్లాన్ ద్వారా కొన్ని అదనపు ప్రయోజనాలు కూడా లభిస్తాయి. అవేంటో తెలుసుకుందాం పదండి.

Jio రూ.209 ప్లాన్ అదనపు ప్రయోజనాలు

  • జియో టీవీ
  • జియో సినిమా
  • జియో క్లౌడ్
  • జియో సెక్యూరిటీ

జియో అందిస్తోన్న రూ.209 ప్రీపెయిడ్ ప్లాన్ ద్వారా డేటా, కాల్స్, ఎస్ఎంఎస్, వ్యాలిడిటీ వంటి ప్రయోజనాలతో పాటు అదనపు బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ఈ ప్లాన్ రీచార్జ్ చేసుకునే వారికి జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్, జియో సెక్యూరిటీ యాప్స్ కి ఉచిత యాక్సెస్ లభిస్తుంది.

తక్కువ ధరలో 28 రోజుల వ్యాలిడిటీ, డెయిలీ డేటా, ఎస్ఎంఎస్, కాలింగ్ వంటి ప్రయోజనాలతో కూడిన ప్రీపెయిడ్ ప్లాన్ కోసం చూసే వారికి జియో రూ.209 ప్లాన్ ఉపయోగపడుతుంది. ఓసారి ప్లాన్ యొక్క ప్రయోజనాలు పూర్తిగా చదివి మీకు సరిపోయే ప్లాన్ అయితే రీచార్జ్ చేసుకోండి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.