Jio రూ.1,199 ప్లాన్: 84 రోజుల వ్యాలిడిటీ, 252జిబి డేటాతో పాటు మరెన్నో బెనిఫిట్స్

Highlights

  • ఎన్నో వాల్యూ ఫర్ మనీ ప్లాన్స్ అని అందిస్తోన్న Jio సంస్థ
  • రూ.1199 ప్రీపెయిడ్ ప్లాన్ తో బోలెడన్ని ప్రయోజనాలను అందిస్తోన్న జియో
  • 84 రోజుల వ్యాలిడిటీ, డెయిలీ డేటా, డెయిలీ ఎస్ఎంఎస్, అపరిమిత కాలింగ్ వంటి ప్రయోజనాలు అందించనున్న రూ.1199 ప్లాన్

భారతదేశంలోని టెలీకామ్ కంపెనీల్లో అగ్రస్థానంలో దూసుకెళ్తోంది Reliance Jio. జియో సంస్థ ఇప్పటికే దేశ వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో 5జీ సేవలను లాంచ్ చేసింది. ప్రస్తుతం 5జీ నెట్వర్క్ ని అన్ని ప్రాంతాలకు చేరవేసే పనిలో జియో నిమగ్నమైంది. జియోకి ప్రధాన పోటీ ఎయిర్టెల్ నుంచి ఎదురవుతుంది.

ఇటీవలె ట్రాయ్ విడుదల చేసిన సబ్‌స్క్రైబర్ గణాంకాల జాబితాలో జియో, ఎయిర్టెల్ లో అత్యధిక సంఖ్యలో యూజర్లను పొందినట్లు స్పష్టమైంది. మరోవైపు బీఎస్ఎన్ఎల్ సంస్థ ప్రభుత్వం ఇచ్చిన ప్యాకేజీతో మళ్ళీ తన మునుపటి ప్రభను పొందేందుకు ప్రయత్నిస్తోంది. ఇక వొడాఫోన్ ఐడియా సంస్థ పెద్ద ఎత్తున యూజర్లను కోల్పోయి మరింత దిగజారింది.

జియో తన యూజర్ల కోసం ఎన్నో వాల్యూ ఫర్ మనీ రీచార్జ్ ప్లాన్స్ ని అందిస్తోంది. అందులో స్వల్ప ధర కలిగినవి ఉన్నాయి, ఇంకా అధిక ధర కలిగినవి ఉన్నాయి. ఈ ఆర్టికల్ లో రూ.1199 ప్రీపెయిడ్ ప్లాన్ లాభాలు తెలుసుకుందాం.

Jio అందిస్తోన్న రూ.1199 ప్లాన్ ద్వారా యూజర్లకు డెయిలీ డేటా, అపరిమిత కాలింగ్, డెయిలీ ఎస్ఎంఎస్, వ్యాలిడిటీ వంటి ప్రయోజనాలు లభిస్తాయి. అలాగే ఈ బెనిఫిట్స్ తో పాటు యూజర్ కి ఇంకా అదనపు ప్రయోజనాలు కూడా లభిస్తాయి. సరే, ఓసారి రూ.1199 ప్రీపెయిడ్ ప్లాన్ అందించే పూర్తి ప్రయోజనాలేంటో తెలుసుకుందాం పదండి.

Jio రూ.1199 ప్రీపెయిడ్ ప్లాన్ ప్రయోజనాలు

  • 84 రోజుల వ్యాలిడిటీ
  • 3జిబి డెయిలీ డేటా
  • డెయిలీ 100 ఎస్ఎంఎస్
  • అపరిమిత కాలింగ్

జియో తీసుకొచ్చిన రూ.1199 ప్రీపెయిడ్ ప్లాన్ ద్వారా యూజర్ కి 84 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. ఇంకా డెయిలీ 3జిబి డేటా లభిస్తుంది. అంటే మొత్తంగా 252జిబి డేటాను యూజర్ పొందుతారు. ఇంకా ఏ నెట్వర్క్ కి అయినా అపరిమితంగా ఉచిత కాల్స్ చేసుకోవచ్చు. అలాగే డెయిలీ 100 ఎస్ఎంఎస్ లభిస్తాయి. ఈ ప్లాన్ ద్వారా యూజర్ కి అదనపు ప్రయోజనాలు కూడా లభిస్తాయి. అవేంటో తెలుసుకుందాం పదండి.

Jio రూ.1199 ప్రీపెయిడ్ ప్లాన్ అదనపు ప్రయోజనాలు

  • జియో టీవీ
  • జియో సినిమా
  • జియో సెక్యూరిటీ
  • జియో క్లౌడ్

జియో అందిస్తోన్న రూ.1199 ప్లాన్ ద్వారా డేటా, వ్యాలిడిటీ, ఎస్ఎంఎస్, కాలింగ్ వంటి ప్రయోజనాలతో పాటు అదనపు బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ ప్లాన్ ద్వారా యూజర్ కి జియో టీవీ, జియో సినిమా, జియో సెక్యూరిటీ, జియో క్లౌడ్ ప్రయోజనాలు లభిస్తాయి. వీటిని యూజర్ ఉచితంగా ఉపయోగించుకోవచ్చు.

జియో సంస్థ అందిస్తోన్న రూ.1199 ప్రీపెయిడ్ ప్లాన్ ప్రయోజనాలు ఏంటో తెలుసుకున్నారు కదా? ఇప్పుడు మరొకసారి ప్లాన్ పూర్తిగా చదివి మీకు సరిపోతే గనుక రీచార్జ్ చేసుకుని బెనిఫిట్స్ పొందండి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.