Jio: అపరిమిత డేటా మరియు కాలింగ్ బెనిఫిట్స్ తో కొత్త రీఛార్జ్ ప్లాన్స్ లాంచ్ చేసిన జియో

Reliance Jio వివిధ ఇంటర్నేషనల్ రీచార్జ్ ప్లాన్స్ లాంచ్ చేసింది. అయితే, విదేశాలకు వెళ్ళే వారి కోసం ప్రత్యేకంగా ఈ ప్లాన్స్ తీసుకొచ్చింది. అధిక వ్యాలిడిటీ, డేటా, ఇన్‌కమింగ్ మరియు ఔట్‌గోయింగ్ కాలింగ్ వంటి ప్రయోజనాలు ఈ ప్లాన్స్ ద్వారా కస్టమర్లకు లభిస్తాయి. అమెరికా మరియు యూఏఈ లతో పాటు 51 దేశాలకు జియో 3 కొత్త రీచార్జ్ ప్లాన్స్ పరిచయం చేసింది. ఈ ప్లాన్స్ లో యాన్యువల్ ప్యాక్ కూడా ఉంది. దీంతో పాటు, జియో ఇన్-ఫ్లయిట్ ప్యాక్స్ ని లాంచ్ చేసింది. ఈ ప్యాక్స్ ద్వారా ఫ్లయిట్ లో ప్రయాణిస్తున్నప్పుడు ఇంటర్నెట్ వినియోగించుకోవచ్చు. సరే, ఓసారి ఈ ప్లాన్స్ గురించి తెలుసుకుందాం పదండి.

Airtel-Vodafone కంటే 60 శాతం చవకగా Jio ఇంటర్నేషనల్ ప్లాన్స్

  • జియో కొత్తగా తీసుకొచ్చిన ప్లాన్స్ ఇతర టెలీకామ్ ఆపరేటర్లు అందిస్తోన్న ధర కంటే 60 శాతం వరకు చవకగా లభించనున్నాయని జియో సంస్థ చెబుతోంది.
  • ఇంటర్నేషనల్ రోమింగ్ రీచార్జెస్ తో పాటు, ఉచిత ఇన్-ఫ్లయిట్ యాక్సెస్ ని జియో సంస్థ పరిచయం చేసింది.

జియో యూఏఈ రోమింగ్ ప్యాక్స్

  • యూఏఈ వెళ్లే వారి కోసం రూ.898, రూ.1598 మరియు రూ.2,998 ప్లాన్లను జియో లాంచ్ చేసింది.
  • ఈ ప్లాన్స్ వరుసగా 7 రోజులు, 14 రోజులు మరియు 21 రోజుల వ్యాలిడిటీని కలిగి ఉన్నాయి.
  • అంతేకాదు, ఈ ప్లాన్స్ ద్వారా 1జిబి, 3జిబి మరియు 7జిబి హైస్పీడ్ డేటా మరియు 100, 150 మరియు 250 నిమిషాలు ఇన్‌కమింగ్ మరియు ఔట్‌గోయింగ్ కాల్స్ వంటి ప్రయోజనాలు లభిస్తాయి.
  • ఇంకా ఈ ప్లాన్స్ ద్వారా అపరిమిత ఇన్‌కమింగ్ ఎస్ఎంఎస్ లభిస్తాయి. అలాగే 64కేబీపీఎస్ స్పీడ్ తో అపరిమిత ఇంటర్నెట్ యాక్సెస్, అపరిమిత వాయిస్ఓవర్ వై-ఫై కాలింగ్ ప్రయోజనాలు లభిస్తాయి.

Jio USA రోమింగ్ ప్యాక్స్

  • అమెరికా మరియు మెక్సికో దేశాలకు జియో యూఎస్ఏ రోమింగ్ ప్యాక్ పరిచయం చేసింది. వీటి ధరలు రూ.1,555, రూ.2,555 మరియు రూ.3,455 గా ఉన్నాయి.
  • ఈ ప్లాన్స్ ద్వారా యూజర్లకు వరుసగా 10 రోజులు, 21 రోజులు మరియు 30 రోజుల వ్యాలిడిటీ లభిస్తాయి.
  • ఇంకా ఈ రోమింగ్ ప్యాక్స్ ద్వారా 7జిబి, 15జిబి మరియు 25జిబి హైస్పీడ్ డేటా మరియు 150, 250, 350 నిమిషాలు ఉచిత వాయిస్ కాలింగ్ ప్రయోజనాలు లభిస్తాయి.
  • యూఏఈ ప్లాన్స్ మాదిరి అపరిమిత వై-ఫై కాలింగ్, అపరిమిత ఇన్‌కమింగ్ ఎస్ఎంఎస్ కూడా లభిస్తాయి.

Jio అధిక వ్యాలిడిటీ ఇంటర్నేషనల్ రోమింగ్ ప్యాక్

  • అధిక వ్యాలిడిటీ అందించే ఇంటర్నేషనల్ రోమింగ్ ప్యాక్ ని జియో పరిచయం చేసింది.
  • రూ.2,799 విలువగల ఈ ప్యాక్ ద్వారా యూజర్లకు 2జిబి హై స్పీడ్ ఇంటర్నెట్ డేటా, 365 రోజుల వ్యాలిడిటీ, 64కేబీపీఎస్ వేగంతో అపరిమిత ఇంటర్నెట్ యాక్సెస్ వంటి ప్రయోజనాలు లభిస్తాయి.
  • ఇంకా ఈ ప్యాక్ ద్వారా కస్టమర్ కి 100 ఉచిత ఇన్‌కమింగ్ మరియు ఔట్‌గోయింగ్ కాల్స్ మరియు 100 ఉచిత ఔట్‌గోయింగ్ ఎస్ఎంఎస్ మరియు అపరిమిత ఇన్‌కమింగ్ ఎస్ఎంఎస్ లభిస్తాయి. ఇకపోతే, ఈ ప్లాన్ 51 దేశాలకు చెల్లుబాటు అవుతుంది.

Jio ఇన్-ఫ్లయిట్ ప్లాన్స్

  • జియో ఇన్-ఫ్లైట్ ప్యాక్స్ కూడా లాంచ్ చేసింది. రూ.195, రూ.295 మరియు రూ.595 విలువగల ఈ ప్లాన్స్ ద్వారా కస్టమర్ కి వరుసగా 250ఎంబి, 500ఎంబి మరియు 1జిబి డేటా ప్రయోజనాలు లభిస్తాయి.
  • ఇంకా 1 రోజు వ్యాలిడిటీ, 100 నిమిషాలు వాయిస్ కాలింగ్ మరియు 100 ఉచిత ఎస్ఎంఎస్ లభిస్తాయి.

Jio ఇంటర్నేషనల్ కాంబో ప్లాన్స్

  • రూ.2,499 ప్లాన్: ఈ ప్లాన్ ద్వారా 10 రోజుల వ్యాలిడిటీ, 100 నిమిషాలు డెయిలీ ఔట్ గోయింగ్ మరియు ఉచిత ఇన్‌కమింగ్ కాలింగ్, 250ఎంబి డేటా, 100 ఎస్ఎంఎస్ లభిస్తాయి. 35 దేశాలకు ఈ ప్లాన్ చెల్లుబాటు అవుతుంది.
  • రూ.4,999 ప్లాన్: ఈ ప్లాన్ ద్వారా 5జిబి డేటా, 1500 నిమిషాలు ఉచిత ఔట్ గోయింగ్ మరియు అపరిమిత ఉచిత ఇన్‌కమింగ్ కాల్స్, 30 రోజుల వ్యాలిడిటీ, 1500 ఎస్ఎంఎస్ లభిస్తాయి. ఈ ప్లాన్ 35 దేశాలకు చెల్లుబాటు అవుతుంది.
  • రూ.3,999 ప్లాన్: ఈ ప్లాన్ ద్వారా 30 రోజుల వ్యాలిడిటీ, 4జిబి డేటా, 250 నిమిషాలు ఉచిత ఔట్ గోయింగ్ మరియు అపరిమిత ఉచిత ఇన్‌కమింగ్ కాల్స్, 100 ఉచిత ఎస్ఎంఎస్ లభిస్తాయి. ఈ ప్లాన్ 51 దేశాలకు చెల్లుబాటు అవుతుంది.
  • రూ.5,999 ప్లాన్: ఈ ప్లాన్ ద్వారా కస్టమర్స్ కి 6జిబి డేటా, 400 నిమిషాలు ఉచిత ఔట్‌గోయింగ్ మరియు అపరిమిత ఉచిత ఇన్‌కమింగ్ కాల్స్, 30 రోజుల వ్యాలిడిటీ, 500 ఉచిత ఎస్ఎంఎస్ లభిస్తాయి. ఈ ప్లాన్ 51 దేశాలకు చెల్లుబాటు అవుతుంది.