కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ లాంచ్ చేసిన Jio

హైలైట్స్:

  • రూ.750 ప్రీపెయిడ్ ప్లాన్ ని లాంచ్ చేసిన జియో, రోజుకి 2జిబి డేటా
  • అన్ని నెట్వర్క్ లకు అపరిమిత కాలింగ్, రోజుకి 100 ఎస్ఎంఎస్ లు, జియో సూట్ కి యాక్సెస్ ఈ ప్లాన్ యొక్క ఇతర ప్రయోజనాలు
  • జియో వెబ్ సైట్ నుంచి రూ.750 ప్లాన్ ని రీచార్జ్ చేసుకునే అవకాశం

భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 వసంతాలు పూర్తయిన సందర్భంగా, రిలయన్స్ జియో రూ.750 విలువ గల కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ లాంచ్ చేసింది. ఇది 2జిబి డేటా పర్ డే ప్లాన్స్ కేటగిరీలో చేరిపోయింది. ఈ ప్లాన్ ద్వారా డేటా తో పాటు ఇంకా అపరిమిత కాల్స్, మరెన్నో ప్రయోజనాలు అందనున్నాయి. ఈ కొత్త ప్లాన్ మైజియో యాప్ లో కూడా లిస్ట్ కాబడింది. ఆసక్తిగల కస్టమర్లు అక్కడి నుంచి ప్లాన్ ని కొనవచ్చు. ఇక కొత్త రూ.750 ప్లాన్ 180జిబి డేటా తో పాటు 90 రోజుల వ్యాలిడిటీని అందిస్తుంది. అలాగే ఈ 180జిబి డేటా రోజుకి 2జిబి లిమిట్ తో లభిస్తుంది.

ఇప్పుడొచ్చిన ఈ రూ.750 ప్లాన్, రూ.719 ప్లాన్ కంటే కాస్త మెరుగైన స్థానంలో ఉంటుంది. రూ.719 ప్లాన్ 84 రోజుల వ్యాలిడిటీని అందిస్తుండగా, రూ.750 ప్లాన్ 90 రోజుల వ్యాలిడిటీని ఇస్తోంది. అలాగే రోజుకి 100 ఎస్ఎంఎస్ లు, 2జిబి డేటా, అపరిమిత కాలింగ్ సౌకర్యం వంటి ప్రయోజనాలను ఈ కొత్త ప్లాన్ తో వినియోగదారులు పొందవచ్చు.

Jio డెయిలీ డేటా ప్లాన్స్

భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు నిండాయి. ఈ సందర్భంగా జరుపుకుంటోన్న ఈ ఏడాది స్వాతంత్ర దినోత్సవం నాడు ప్రముఖ టెలీకామ్ కంపెనీ రిలయన్స్ జియో రూ.750 విలువగల అదిరిపోయే ప్రీపెయిడ్ ప్లాన్ ని లాంచ్ చేసింది. ఈ ప్లాన్ తో రోజుకి 2జిబి డేటా, ఏ నెట్వర్క్ కి అయినా అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకి 100 ఎస్ఎంఎస్ లు, జియో యాప్స్ కి యాక్సెస్ (జియో సావన్, జియో సినిమా తదితర యాప్స్) వంటి ప్రయోజనాలు అందుతాయి. ఇక ఈ రూ.750 ప్లాన్ ని జియో అధికార వెబ్ సైట్ ద్వారా రీచార్జ్ చేసుకోవచ్చు.

ఇండిపెండెన్స్ డే ని పురస్కరించుకుని జియో సంస్థ మరొక ప్లాన్ ని కూడా లాంచ్ చేసింది. అదే అదనపు ప్రయోజనాలతో కూడిన రూ.2,999 ప్లాన్. ఈ ప్లాన్ రీచార్జ్ చేయడం ద్వారా వినియోగదారులు రూ.3,000 విలువగల బెనిఫిట్స్ ని పొందుతారు. ఇప్పుడు ఈ ఆఫర్ ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం. ఈ ప్లాన్ 75జిబి హై-స్పీడ్ డేటాను అందిస్తుంది. అలాగే రూ.750 విలువ గల ఇక్సిగో కూపన్స్, రూ.750 విలువ గల నెట్‌మెడ్స్ కూపన్స్, రూ.750 విలువ గల అజియో కూపన్స్ ఈ ప్లాన్ తో లభిస్తాయి.

ఇప్పటికే రోజుకి 2జిబి డేటాను అందిస్తున్న రూ.248, రూ.299, రూ.533, రూ.719, రూ.1066, రూ.2879 ప్లాన్స్ సరసన తాజాగా లాంచ్ అయిన రూ.750 ప్లాన్ చేరనుంది. ఇక ఈ ప్లాన్స్ అన్నీ కూడా అపరిమిత కాలింగ్, డెయిలీ 100 ఎస్ఎంఎస్ లు, జియో యాప్స్ కి యాక్సెస్ వంటి దాదాపు ఒకే రకమైన ప్రయోజనాలను అందిస్తాయి.