Jio: రూ.49 రీచార్జ్ ప్లాన్‌ని లాంచ్ చేసిన జియో

Highlights

  • రూ.49 ప్లాన్ లాంచ్
  • 25జిబి డేటా ప్రయోజనం
  • ఒక్క రోజు వ్యాలిడిటీ

ప్రముఖ టెలీకామ్ సంస్థ Jio హోలీ పండుగ కానుకగా తన వినియోగదారుల కోసం ఒక కొత్త రీచార్జ్ ప్లాన్ లాంచ్ చేసింది. రూ.49 విలువగల ఈ ప్యాక్ ద్వారా కస్టమర్లకు డేటా ప్రయోజనం లభించనుంది. ఈ ప్లాన్ క్రికెట్ ప్లాన్ కేటగిరీలో లిస్ట్ అయి ఉంది. ఐపీఎల్ 2024 సమీపిస్తుండటంతో జియో కంపెనీ తాజాగా ఈ ప్లాన్‌ని తీసుకొచ్చిందని భావిస్తున్నారు. సరే, ఓసారి రూ.49 రీచార్జ్ ప్లాన్ యొక్క పూర్తి ప్రయోజనాలేంటో తెలుసుకుందాం పదండి.

Jio రూ.49 డేటా ప్యాక్ ప్రయోజనాలు

జియో లాంచ్ చేసిన రూ.49 డేటా ప్యాక్‌ని రీచార్జ్ చేసుకునే కస్టమర్లకు 1 రోజు వ్యాలిడిటీ లభిస్తుంది. ఇంకా ఈ ప్లాన్ ద్వారా డేటా ప్రయోజనం కూడా లభిస్తుంది. అది 2జిబి లేదా 3జిబి డేటా కాదు, ఏకంగా 25జిబి డేటా బెనిఫిట్ లభిస్తుంది. అయితే కేవలం ఒక్క రోజుల వ్యాలిడిటీ మాత్రమేనన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి.

ఈ 25జిబి డేటా ప్రయోజనం ద్వారా యూజర్లు ఐపీఎల్ 2024 మ్యాచులను జియోసినిమా యాప్ పై ఆన్‌లైన్ ద్వారా చూడవచ్చు. క్రికెట్ ఆఫర్ లో భాగంగానే ప్రత్యేకంగా ఈ ప్లాన్ ని పరిచయం చేశారు. అయితే, వ్యాలిడిటీ కేవలం 1 రోజు కావడం కాస్త నిరాశపరిచే విషయం. 25జిబి డేటాను యూజర్ ఒక్క రోజులోనే వినియోగించుకోవాల్సి ఉంటుంది. మరుసటి రోజుకి డేటా బదిలీ చేయబడదు.

యూజర్ గనుక 25జిబి డేటాను ఒక రోజు లోపే పూర్తి చేసినప్పటికీ, ఇంటర్నెట్ వాడుకోవచ్చు. అయితే ఇంటర్నెట్ వేగం 64కేబీపీఎస్ మాత్రమే లభిస్తుంది.

ఐపీఎల్ 2024 చూసేందుకు ఉత్తమమైన ప్లాన్ ఇదే

మీరు గనుక ఐపీఎల్ 2024 మ్యాచులను మీ మొబైల్ పై లైవ్ ద్వారా చూడాలనుకుంటే, మీకు చాలా డేటా కావాల్సి ఉంటుంది. అందుకై మీరు రూ.49 డేటా ప్యాక్ రీచార్జ్ చేయిస్తే, 25జిబి డేటా ప్రయోజనం లభిస్తుంది. దీంతో మీరు ఐపీఎల్ మ్యాచులను హ్యాపీగా చూసేయవచ్చు.

Airtel రూ.49 ప్లాన్ ప్రయోజనాలు

జియో తాజాగా తీసుకొచ్చినటువంటి డేటా ప్యాక్ మాదిరే ఎయిర్టెల్ లో కూడా ఒక ప్లాన్ ఉంది. ఎయిర్టెల్ వద్ద ఉన్న రూ.49 డేటా ప్యాక్ ద్వారా యూజర్ కి 1 రోజు వ్యాలిడిటీ లభిస్తుంది. అలాగే ఈ ప్లాన్ ద్వారా యూజర్ కి 20జిబి అపరిమిత డేటా లభిస్తుంది. డేటాను పూర్తిగా వాడేసిన తర్వాత కూడా ఇంటర్నెట్ వాడుకోవచ్చు. అయితే చాలా తక్కువ వేగంతో ఇంటర్నెట్ బ్రౌజ్ చేయవచ్చు.