రూ.349, రూ.899 రీచార్జ్ ప్లాన్స్‌ని లాంచ్ చేసిన Jio

Highlights

  • రూ.899, రూ.349 ప్రీపెయిడ్ ప్లాన్స్ ని తీసుకొచ్చిన జియో సంస్థ
  • డెయిలీ 2.5జిబి డేటా అందించనున్న రెండు ప్లాన్స్
  • రెగ్యులర్ బెనిఫిట్స్ తో పాటు అదనపు ప్రయోజనాలను అందించనున్న ప్లాన్స్

రిలయన్స్ జియో సంస్థ తాజాగా తన యూజర్ల కోసం రెండు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్స్ ని తీసుకొచ్చింది. ఈ ప్లాన్ ధరలు రూ.349, రూ.899 గా ఉన్నాయి. రెండు ప్లాన్స్ కూడా జియో యాప్స్ కి యాక్సెస్ ని ఉచితంగా అందిస్తాయి. అలాగే అద్భుతమైన వ్యాలిడిటీ, ఎక్కువ డేటా వంటి ప్రయోజనాలు లభిస్తాయి. రెండు ప్లాన్స్ లోనూ కస్టమర్ కి డెయిలీ 2.5జిబి డేటా లభిస్తుంది. ఎక్కువ డేటా కోసం చూసే కస్టమర్ కి ఈ ప్లాన్స్ ఎంతో ఉపయోగపడతాయి. సరే ఓసారి ఈ రెండు ప్లాన్స్ యొక్క పూర్తి వివరాలను తెలుసుకుందాం పదండి.

Reliance Jio Rs.349 ప్రీపెయిడ్ ప్లాన్

రిలయన్స్ జియో అందిస్తోన్న రూ.349 ప్లాన్ ద్వారా 30 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. 28 రోజలు వ్యాలిడిటీతో విసిగిపోయిన వారికి ఇది కాస్త ఊరటనిస్తుంది. ఒక్కసారి రీచార్జ్ చేస్తే మళ్ళీ నెల రోజుల వరకు నిశ్చింతగా ఉండొచ్చు.

జియో రూ.349 ప్రీపెయిడ్ ప్లాన్ ద్వారా ప్రతిరోజూ యూజర్ కి 2.5జిబి డేటా లభిస్తుంది. అంటే యూజర్స్ తన ప్లాన్ వ్యాలిడిటీ పూర్తయ్యేసరికి మొత్తం 75జిబి డేటా పొందుతారు. డేటా పరిమితి దాటాక, స్పీడ్ 64కేబీపీఎస్ కి పడిపోతుంది.

రూ.349 ప్లాన్ ద్వారా అపరిమిత కాలింగ్ సౌకర్యం కూడా ఉంది. దీంతో యూజర్ లోకల్ మరియు ఎస్టీడీ కాల్స్ ని ఏ నెట్వర్క్ కి అయినా ఉచితంగా మాట్లాడుకోవచ్చు. 30 రోజుల పాటు ఈ కాలింగ్ సౌకర్యం చెల్లుబాటు అవుతుంది.

ఉచిత కాలింగ్ తో పాటు, ఇంకా కస్టమర్ కి ప్రతిరోజూ 100 ఎస్ఎంఎస్ లభిస్తాయి. అంతేకాదండోయ్ కస్టమర్ కి ఇంకా జియో యాప్స్ కి ఉచిత యాక్సెస్ లభిస్తుంది. ప్లాన్ లో భాగంగా జియో సినిమా, జియో టీవీ, జియో సెక్యూరిటీ, జియో క్లౌడ్ యాప్స్ కి ఉచిత సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది.

Reliance Jio Rs.899 ప్రీపెయిడ్ ప్లాన్

రిలయన్స్ జియో అందిస్తోన్న ఈ ప్లాన్ ద్వారా యూజర్ కి 90 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. దీంతో పాటు ప్రతిరోజూ 2.5జిబి డేటా లభిస్తుంది. అంటే ప్లాన్ మొత్తం ముగిసే లోపు యూజర్ కి మొత్తం 225జిబి డేటా లభిస్తుందన్నమాట. ఎక్కువ డేటా కావాలనుకునే వారికి ఈ ప్లాన్ ఎంతో ఉపయోగపడుతుంది.

రూ.899 ప్లాన్ తో యూజర్ కి 90 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. ఎక్కువ రోజులు వ్యాలిడిటీ కావాలనుకునే కస్టమర్లు ఈ ప్లాన్ ని ప్రయత్నించవచ్చు. దీంతో పాటు, అపరిమిత కాలింగ్ సౌకర్యం, ప్రతిరోజూ 100 ఎస్ఎంఎస్ లు లభిస్తాయి. ఇంకా అదనపు ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అవేంటంటే, యూజర్ కి ఉచితంగా జియో టీవీ, జియో సినిమా, జియో సెక్యూరిటీ, జియో క్లౌడ్ యాప్స్ కి యాక్సెస్ లభిస్తుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.