రూ.222 ధరలో స్పెషల్ డేటా ప్లాన్ ని లాంచ్ చేసిన Jio

హైలైట్స్

  • ఫుట్ బాల్ లవర్స్ కోసం రూ.222 4జీ డేటా-ఓన్లీ వోచర్ ని లాంచ్ చేసిన జియో
  • ఫిఫా వరల్డ్ కప్ మ్యాచెస్ చూసేవారి కోసం ఉపయోగపడనున్న ప్యాక్
  • ఈ డేటా-ఓన్లీ వోచర్ ద్వారా లభించనున్న 30 రోజుల వ్యాలిడిటీ, 50జిబి హై-స్పీడ్ డేటా
  • కస్టమర్లు తమ రెగ్యులర్ ప్యాక్ డెయిలీ డేటా లిమిట్ ముగిసాకే డేటా వోచర్ ని వాడుకునే అవకాశం

రిలయన్ జియో వివిధ ధరల శ్రేణుల్లో ఎన్నో రీచార్జ్ ప్లాన్స్ ని ఆఫర్ చేస్తోంది. వాల్యూ ఫర్ మనీ ప్యాక్స్ అందించడంలో జియోకి మంచి పేరుంది. దీంతో కస్టమర్లు జియో ప్లాన్స్ పట్ల ఆకర్షితులవ్వడం సహజం. ఎప్పటికప్పుడు జియో కొత్త ప్లాన్స్ ని పరిచయం చేస్తూ యూజర్లకు బెనిఫిట్స్ అందిస్తూ ఉంటుంది. తాజాగా జియో రూ.222 డేటా-ఓన్లీ ప్యాక్ ని లాంచ్ చేసింది. దీన్ని జియో ‘ఫుట్‌బాల్ వరల్డ్ కప్ డేటా ప్యాక్’ అని పిలుస్తోంది.

రూ.222 విలువజేసే ఈ డేటా-ఓన్లీ ప్లాన్ ద్వారా 30 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. ఇంకా 50జిబి హై-స్పీడ్ డేటా కూడా లభిస్తుంది. అంటే, ఈ ప్యాక్ రీచార్జ్ చేసే యూజర్లు 1జిబి డేటాకి కేవలం రూ.4.44 మాత్రమే ఖర్చు చేస్తున్నారన్నమాట. ఇదెంతో వాల్యూ ఫర్ మనీ ప్లాన్ అని చెప్పవచ్చు.

అయితే ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇదొక డేటా-యాడ్-ఆన్ ప్లాన్. అంటే మీరు ప్రస్తుతం వాడుతోన్న డెయిలీ డేటా లిమిట్ ముగిశాక మాత్రమే ఈ డేటా వోచర్ ప్రయోజనాలను వాడుకోవచ్చు. ఇక 50జిబి డేటాను వినియోగించిన తర్వాత, ఇంటర్నెట్ స్పీడ్ 64కేబీపీఎస్ కి పడిపోతుంది.

Jio రూ.222 డేటా-ఓన్లీ ప్యాక్

బెనిఫిట్స్

  • 50జిబి డేటా/డెయిలీ లిమిట్స్ లేవు
  • 30 రోజుల వ్యాలిడిటీ
  • 4జి డేటా-ఓన్లీ ప్యాక్ అంటే కాల్స్ మరియు ఎస్ఎంఎస్ బెనిఫిట్స్ ఉండవు
  • ఈ ప్రత్యేక డేటా ప్యాక్ ప్రయోజనాలు పొందాలంటే యూజర్లు ఒక యాక్టివ్ బేస్ ప్లాన్ ని కలిగి ఉండాలి.

రూ.222 ప్లాన్ కేవలం డేటా ప్రయోజనాలను మాత్రమే అందిస్తుంది. ఇది 30 రోజుల వ్యాలిడిటీ కలిగి ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకించి ఫుట్‌బాల్ ఫ్యాన్స్ కోసం లాంచ్ అయ్యింది. జియో సినిమా లేదా ఇతర ఆన్‌లైన్ ప్లాట్ఫామ్స్ పై ఫుట్‌బాల్ మ్యాచెస్ ని లైవ్ లో చూసేందుకు ఈ ప్యాక్ ద్వారా లభించే డేటా ఉపయోగపడుతుంది. అయితే ఈ స్పెషల్ డేటా ప్లాన్ ఎన్ని రోజుల పాటు అందుబాటులో ఉంటుందో తెలియదు. ఫిఫా వరల్డ్ కప్ ముగిశాక ఈ ప్లాన్ ని తీసేసే అవకాశం ఉంది.

మైజియో యాప్ లేదా జియో అధికార వెబ్ సైట్ ద్వారా రూ.222 డేటా-ఓన్లీ ప్లాన్ ని రీచార్జ్ చేసుకోవచ్చు. దేశ వ్యాప్తంగా ఉన్న జియో కస్టమర్లు ఈ ప్లాన్ ని వినియోగించుకోవచ్చు. మీరు ప్రస్తుతం వినియోగిస్తోన్న యాక్టివ్ ప్లాన్ యొక్క డెయిలీ డేటా లిమిట్ ముగిసిన తర్వాత రూ.222 ప్లాన్ యొక్క డేటా ప్రయోజనాలను వినియోగించుకోవచ్చు.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.