రూ.2023 విలువగల Happy New Year 2023 ప్లాన్‌ని తీసుకొచ్చిన Jio

హైలైట్స్

  • హ్యాపీ న్యూ ఇయర్ 2023 ప్లాన్ ని లాంచ్ చేసిన జియో కంపెనీ
  • 252 రోజుల వ్యాలిడిటీ అందించనున్న జియో రూ.2023 న్యూ ఇయర్ ప్లాన్
  • రూ.2023 ప్లాన్ తో లభించనున్న 2.5జిబి డెయిలీ డేటా, అపరిమిత కాలింగ్ సౌకర్యం

ప్రతి ఏడాది లాగే, ఈసారి కూడా రిలయన్స్ జియో హ్యాపీ న్యూ ఇయర్ ప్లాన్ ని కొత్త సంవత్సరానికి ముందు లాంచ్ చేసింది. జియో హ్యాపీ న్యూ ఇయర్ 2023 అనే పేరుతో వచ్చిన ఈ కొత్త రీచార్జ్ ప్లాన్ ధర రూ.2023. ఈ ప్లాన్ ద్వారా వినియోగదారునికి 2.5 జిబి డెయిలీ డేటా, 9 నెలల వ్యాలిడిటీ లభిస్తుంది. జియో.కామ్, మైజియో యాప్ ద్వారా లేదా మరేదైనా మొబైల్ రీచార్జ్ ఆఫర్ చేసే యాప్ ద్వారా ఈ రీచార్జ్ ని చేసుకునే వీలుంది. ఎక్కువ రోజులు వ్యాలిడిటీ, డెయిలీ డేటా, అపరిమిత కాలింగ్, డెయిలీ ఎస్ఎంఎస్ లు కావాలనుకునే వారికి ఈ ప్లాన్ బాగా సరిపోతుంది. మరి ప్లాన్ పూర్తి వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం పదండి.

Jio Happy New Year 2023 ప్లాన్ వివరాలు

జియో హ్యాపీ న్యూ ఇయర్ 2023 ప్లాన్ ని కస్టమర్ రూ.2023 తో రీచార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్లాన్ తో కస్టమర్ కి 9 నెలల వ్యాలిడిటీ (అంటే 252 రోజులు) లభిస్తుంది. ఇదే కాకుండా, ఈ ప్లాన్ తో ఇతర బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. అవి:

1. డెయిలీ 100 ఎస్ఎంఎస్

2. జియో యాప్స్ కి ఉచిత సబ్‌స్క్రిప్షన్

3. కొత్త సబ్‌స్క్రైబర్లకు ప్రైమ్ మెంబర్షిప్

ఇక న్యూ ఇయర్ ప్లాన్ కి తోడు జియో కంపెనీ ఇప్పటికే అందుబాటులో ఉన్న రూ.2,999 ప్లాన్ యొక్క వ్యాలిడిటీని మరొక 23 రోజులు పొడిగించింది. ఈ ప్లాన్ వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.

జియో రూ.2,999 ప్లాన్ ప్రయోజనాలు

జియో అందిస్తోన్న రూ.2,999 ప్లాన్ తో యూజర్లకు 75జిబి హై-స్పీడ్ డేటా లభిస్తుంది. ఈ 75జిబి అదనపు డేటా కాకుండా, ప్రతిరోజూ 2.5జిబి డేటా చొప్పున ప్లాన్ కాల వ్యవధి ముగిసే వరకు కూడా యూజర్ కి లభిస్తుంది. ఈ ప్లాన్ ద్వారా యూజర్ కి 365 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. అలాగే ప్రతిరోజూ 100 ఎస్ఎంఎస్ లు యూజర్ పొందుతాడు. అదనంగా జియో యాప్స్ కి కూడా ఉచిత సబ్‌స్క్రిప్షన్ యూజర్ సొంతమవుతుంది.

ఇప్పుడు ఈ ప్లాన్ కి జియో స్వల్ప మార్పు చేసింది. అదేంటంటే, రూ.2,999 ప్లాన్ తో అందుతోన్న బెనిఫిట్స్ తో పాటు 23 రోజుల వ్యాలిడిటీని అదనంగా అందిస్తోంది. అంతేకాదండోయ్, 75జిబి అదనపు డేటా కూడా ఈ ప్లాన్ తో యూజర్ కి లభిస్తుంది. మొత్తానికి న్యూ ఇయర్ ప్లాన్ లాంచ్ చేయడంతో పాటు, రూ.2,999 ప్లాన్ కి కూడా అదనపు డేటా, వ్యాలిడిటీ ప్రయోజనాలను తీసుకొచ్చిన జియో వినియోగదారులను ఆకర్షిచండంలో తనకు తానే సాటి అని మరోసారి నిరూపించుకుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.