కొత్త పోస్ట్‌పెయిడ్ ఫ్యామిలీ ప్లాన్ ని లాంచ్ చేసిన Jio

Highlights

  • ఒక నెల ట్రయల్ ఆప్షన్ తో పోస్ట్‌పెయిడ్ ఫ్యామిలీ ప్లాన్ లాంచ్ చేసిన జియో
  • రూ.399 తో ప్రారంభం కానున్న రిలయన్స్ జియో పోస్ట్‌పెయిడ్ ఫ్యామిలీ ప్లాన్
  • ఈ ప్లాన్స్ తో లభించనున్న ఉచిత డేటా, ఓటీటీ ప్రయోజనాలు

భారతదేశంలో ఉన్న పెద్ద టెలీకామ్ సంస్థ రిలయన్స్ జియో. ఈ సంస్థ 4 కోట్ల కస్టమర్లను కలిగి ఉంది. ఇక మీరు గనుక రిలయన్స్ జియో పోస్ట్‌పెయిడ్ కస్టమర్ అయితే మీకొక శుభవార్త వచ్చింది. రిలయన్స్ జియో సంస్థ కొత్త పోస్ట్‌పెయిడ్ ఫ్యామిలీ ప్లాన్ ని లాంచ్ చేసింది. ఈ ప్లాన్స్ ఒక నెల ఉచిత ట్రయల్ తో వచ్చాయి. ఈ ప్లాన్స్ ద్వారా ఉచిత డేటా, కాలింగ్ మరియు ఓటీటీ ప్రయోజనాలు లభిస్తాయి. జియో ఫ్యామిలీ ప్లాన్ రూ.399 తో ప్రారంభమవుతుంది. సరే, ఓసారి ప్లాన్ విశేషాలు తెలుసుకుందాం పదండి.

ప్లాన్ ప్రారంభ ధర: రూ.399

రిలయన్స్ జియో కొత్త ఫ్యామిలీ ప్లాన్ జియో ప్లస్ ని లాంచ్ చేసింది. ఒక నెల ఉచిత ట్రయల్ తో ఈ ప్లాన్ వచ్చింది. జియో ప్లస్ ప్లాన్ లో మొదటి కనెక్షన్ కోసం రూ.399 చెల్లించాలి. అంతేకాదు, ఈ ప్లాన్ కి మరొక 3 కనెక్షన్స్ ని జత చేసుకోవచ్చు. ఈ అదనపు కనెక్షన్స్ ఒక్కోదానికి రూ.99 చెల్లించాలి. అంటే జియో ప్లస్ లోని ఈ 4 కనెక్షన్ లకు మొత్తం రూ.696 (399+99+99+99) ఒక నెలకు ఖర్చవుతుంది. ఇకపోతే ఈ ప్లాన్ ద్వారా 75జిబి డేటా లభిస్తుంది. 4 కనెక్షన్ లతో కూడిన సింగిల్ సిమ్ ఫ్యామిలీ ప్లాన్ కి నెలకు రూ.174 ఖర్చవుతుంది.

దీంతో పాటు, ఎక్కువ డేటా వాడే కస్టమర్లు 100జిబి (నెలకు) ప్లాన్ ఎంపిక చేసుకోవచ్చు. దీనికి యూజర్లు మొదటి కనెక్షన్ కోసం రూ.699 చెల్లించాలి. తర్వాత ప్రతీ కనెక్షన్ కి రూ.99 చెల్లించాలి. అదనంగా 3 వరకు మాత్రమే కనెక్షన్ లను జత చేసుకోవచ్చు.

రిలయన్స్ జియో కొన్ని ఇతర ప్లాన్స్ ని లాంచ్ చేసింది. రూ.299 ప్లాన్ ద్వారా 30జిబి డేటా లభిస్తుంది. రూ.599 ప్లాన్ ద్వారా అపరిమిత డేటా లభిస్తుంది. అంతేకాదండోయ్, జియో ప్లస్ ఫ్యామిలీ ప్లాన్ ద్వారా ఇతర ఎన్నో బెనిఫిట్స్ ని జియో అందిస్తోంది.

లభించనున్న అపరిమిత ఉచిత 5జీ డేటా

జియో ట్రూ 5జీ వెల్కమ్ ఆఫర్ తో అపరిమిత 5జీ డేటా లభిస్తుంది. మొత్తం ఫ్యామిలీ ఈ డేటాను వాడుకోవచ్చు. డెయిలీ లిమిట్ అనేది వర్తించదు. అంటే మీకు నచ్చినంత డేటాను వినియోగించుకోవచ్చు. అందుబాటులో ఉన్న నంబర్ల నుంచి కస్టమర్లు తమకు నచ్చిన వాటిని ఎంపిక చేసుకోవచ్చు. సింగిల్ బిల్లింగ్, డేటా షేరింగ్ మరియు నెట్‌ఫ్లిక్స్, అమెజాన్, జియో టీవీ మరియు జియో సినిమా వంటి ఎంటర్టెయిన్మెంట్ కంటెంట్ ప్రయోజనాలు కస్టమర్ కి లభిస్తాయి.

జియో ఫైబర్ యూజర్లు, కార్పొరేట్ ఎంప్లాయిస్, ఇతర కంపెనీల ఎగ్జిస్టింగ్ పోస్ట్‌పెయిడ్ యూజర్లు, యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్‌సీ, ఎస్బీఐ కస్టమర్లు సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించనవసరం లేదు.

వాడుక తర్వాత ఉచిత ట్రయల్‌ని రద్దు చేసుకునే అవకాశం

సేవల పట్ల సంతృప్తి చెందని కస్టమర్లు ఒక నెల ఉచిత ట్రయల్ తర్వాత ప్లాన్ ని రద్దు చేసుకునే అవకాశం ఉందని జియో సంస్థ చెబుతోంది. ఉచిత ట్రయల్ అనంతరం కస్టమర్ తన కనెక్షన్ ని ఏ అభ్యంతరాలు లేకుండా రద్దుచేసుకోవచ్చు.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.