Jio Independence Offer: ఒక్క రీచార్జ్ తో ఎన్నో బెనిఫిట్స్

హైలైట్స్:

  • రూ.3000 విలువ గల ఉచిత ప్రయోజనాలను అందిస్తోన్న జియో ఇండిపెండెన్స్ ఆఫర్
  • రూ.2999 రీచార్జ్ ప్లాన్ ద్వారా లభించనున్న అజియో, నెట్‌మెడ్స్.కామ్, ఇక్సిగో వోచర్స్ (ఒక్కొక్కటి రూ.750)
  • రూ.750 విలువ గల 75జిబి అదనపు డేటా కూడా లభ్యం

జియో తన వినియోగదారుల కోసం ఇండిపెండెన్స్ ఆఫర్ ని ప్రకటించింది. రూ.2999 విలువ గల జియో రీచార్జ్ తో వినియోగదారులు రూ.3,000 విలువ గల ప్రయోజనాలు పొందవచ్చు. ఆగస్టు 15 న జరగబోవు స్వాతంత్ర దినోత్సవానికి కొన్ని రోజుల ముందు ఈ ఇండిపెండెన్స్ ఆఫర్ ను జియో ప్రకటించింది. రూ.3,000 బెనిఫిట్స్ తో పాటు ఈ ప్లాన్ ద్వారా డెయిలీ 2.5జిబి హై-స్పీడ్ 4జీ డేటా లభిస్తుంది. దీనికి 365 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. అలాగే ఏడాది పాటు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ యొక్క సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ లభిస్తుంది. మరి జియో ఇండిపెండెన్స్ ఆఫర్ ఇంకా ఏయే ప్రయోజనాలు అందిస్తుందో తెలుసుకుందాం పదండి.

Jio రూ.2,999 ఇండిపెండెన్స్ ఆఫర్ వివరాలు

కొన్ని నెలల నుంచి జియో రూ.2999 రీచార్జ్ ప్లాన్ ని ఆఫర్ చేస్తోంది. ఈ ప్యాక్ ద్వారా ప్రతిరోజూ 2.5జిబి డేటా, 365 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. అంటే మొత్తం 912.5 జిబి డేటా పొందుతారు. ఈ ప్లాన్ తో మీకు అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకి 100 ఎస్ఎంఎస్, ఏడాది పాటు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ మొబైల్ ప్లాన్ వంటి ప్రయోజనాలు లభిస్తాయి.

ఇండిపెండెన్స్ ఆఫర్ సందర్భంలో కస్టమర్లు రూ.2999 ప్లాన్ ని రీచార్జ్ చేస్తే, రూ.3,000 ప్రయోజనాలు పొందుతారు. ఈ ప్రయోజనాల్లో భాగంగా రూ.750 అజియో వోచర్, రూ.750 నెట్‌మెడ్స్.కామ్ ఓచర్, రూ.750 ఇక్సిగో వోచర్, రూ.750 అదనపు డేటా లభిస్తాయి.

మరో వార్తేంటంటే, ఆగస్టు 15 న స్వాతంత్ర దినోత్సవం నాడు జియో తన 5జీ నెట్వర్క్ ని భారత్ లో లాంచ్ చేయనున్నట్లు సమాచారం. ఇక 5జీ స్పెక్ట్రమ్ వేలం లో జియో టాప్ బిడ్డర్ గా నిలిచింది. ఖరీదైన, సమర్థవంతమైన 700 మెగాహెర్ట్జ్ బ్యాండ్ లో ఎక్కువ పెట్టుబడి పెట్టి ఇతర టెలీకామ్ సంస్థలకు గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఈ ఏడాది చివరి కల్లా దేశ వ్యాప్తంగా 5జీ సేవలను అందించాలని జియో లక్ష్యంగా పెట్టుకుంది. 4జీ కంటే 5జీ రీచార్జ్ ప్లాన్స్ ధరలు చాలా ఎక్కువగా ఉంటాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

భారత్ లోని 1000 పట్టణాలకు జియో 5జీ కవరేజ్ ప్లాన్ ని పూర్తి చేసింది. మొదటి దశలో 22 నగరాల్లో 5జీ నెట్వర్క్ ప్రారంభం కానుంది. హీట్ మ్యాప్స్, 3డీ మ్యాప్స్, రే ట్రేసింగ్ టెక్నాలజీస్ ని ఉపయోగించి క్లైంట్ యూసేజ్, రెవెన్యూ పాసిబిలిటీస్ ని టార్గెట్ చేస్తూ కవరేజ్ ప్లానింగ్ ని చేశారు. 24,740 మెగాహెర్ట్జ్ 5జీ స్పెక్ట్రమ్ కోసం రూ.88,078 కోట్లను జియో వెచ్చించింది. 700 మెగాహెర్ట్జ్, 800 మెగాహెర్ట్జ్, 1,800 మెగాహెర్ట్జ్, 3,300 మెగాహెర్ట్జ్, 26 గిగాహెర్ట్జ్ బ్యాండ్స్ లో ఉన్న స్పెక్ట్రమ్ కి జియో యాక్సెస్ ను పొందింది.

6జీ లో రీసెర్చి, స్టాండర్డైజేషన్ కొరకు జియో, ఫిన్లాండ్ లోని యూనివర్శిటీ ఆఫ్ ఊలు తో జట్టుకట్టింది. ప్రస్తుతం వరల్డ్ 6జీ రీసెర్చ్ ప్రోగ్రామ్ కి ఊలు యూనివర్శిటీ ఇన్‌చార్జ్ గా వ్యవహరిస్తోంది.