రూ.198 విలువజేసే చవకైన ప్లాన్‌ని లాంచ్ చేసిన Jio

Highlights

  • రూ.198 విలువగల బ్యాకప్ ప్లాన్ ని పరిచయం చేసిన జియో ఫైబర్
  • మార్చి 30 నుంచి అందుబాటులోకి రానున్న కొత్త ప్లాన్
  • వన్‌క్లిక్ స్పీడ్ అప్‌గ్రేడ్ ఫెసిలిటీతో వస్తోన్న కొత్త ప్లాన్

రిలయన్స్ జియో సంస్థ తాజాగా కొత్త మరియు చవకైన ప్లాన్ ని తన జియో ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారుల కోసం తీసుకొచ్చింది. ఈ కొత్త ప్లాన్ ని కంపెనీ బ్లాకప్ ప్లాన్ అని పిలుస్తోంది. ఈ ప్లాన్ ధర రూ.198 గా ఉంది. మరియు ఇది అపరిమిత ఇంటర్నెట్ డేటాను అందిస్తుంది. డేటా లిమిట్ లేకుండా ఈ ప్లాన్ ని ప్రత్యేకించి టాటా ఐపీఎల్ కోసం తీసుకొచ్చినట్లు స్పష్టమవుతోంది. కస్టమర్లు 10ఎంబీపీఎస్ నుంచి 100ఎంబీపీఎస్ స్పీడ్ ఆప్షన్స్ ని ఈ ప్లాన్ ద్వారా ఎంచుకునే అవకాశం ఉంది. మార్చి 30 నుంచి ఈ ప్లాన్ ని రీచార్జ్ చేసుకునే వీలుంది.

రూ.198 జియో ఫైబర్ ప్లాన్

జియో ఫైబర్ బ్రాడ్ బ్యాండ్ బ్యాక్ అప్ ప్లాన్ రూ.198 ధరలో లభిస్తుంది. దీని ద్వారా ఒక నెల వ్యాలిడిటీ లభిస్తుంది. ఈ ప్లాన్ తో 10ఎంబీపీఎస్ వరకు అపరిమిత డేటా లభిస్తుంది. ఈ ప్లాన్ తో అన్‌లిమిటెడ్ ల్యాండ్ లైన్ కాలింగ్ సౌకర్యం లభిస్తుంది. ఇంకా ఈ ప్లాన్ తో వన్ క్లిక్ స్పీడ్ అప్‌గ్రేడ్ ఫెసిలిటీ కూడా అందుబాటులో ఉంది. అంటే యూజర్లు 1 లేదా 2 లేదా 7 రోజులకు గాను డేటా వేగాన్ని 30ఎంబీపీఎస్ లేదా 100ఎంబీపీఎస్ కి పెంచుకోవచ్చు. క్రింద ఇవ్వబడిన పిక్చర్ చూసి వివరాలు తెలుసుకోండి.

మీ యొక్క ప్రైమరీ ఇంటర్నెట్ కనెక్షన్ కి తోడు 30ఎంబీపీఎస్ స్పీడ్ కావాలని భావిస్తే, అప్పుడు మీరు ఒక రోజుకి గాను రూ.21, 2 రోజులైతే రూ.31, 7 రోజులైతే రూ.101 చెల్లించాలి. మరోవైపు, మీకు గనుక 100ఎంబీపీఎస్ స్పీడ్ కావాలంటే, 1 రోజుకి గాను రూ.32, 2 రోజులకు గాను రూ.52, 7 రోజులకు గాను రూ.152 చెల్లించాలి. ఇకపోతే జియో వద్ద జియో ఫైబర్ బ్యాకప్ ప్లాన్ క్రింద రూ.100 మరియు రూ.200 ప్లాన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. వీటి ద్వారా 400 లైవ్ టీవీ చానల్స్, 4కే సెట్ టాప్ బాక్స్ తో కూడిన 6 ఓటీటీ ఉచితంగా లభిస్తాయి.

బ్యాకప్ ప్లాన్ కనీసం 5 నెలలు అందుబాటులో ఉంటుంది. దీనిని పొందేందుకు మీరు రూ.1490 (5 నెలలకు గాను రూ.990 మరియు ఇన్‌స్టలేషన్ కి రూ.500) చెల్లించాలి. ఎస్టీబీ అప్‌గ్రేడ్ కోసమైనా, మీరు5 నెలలకు గాను రూ.500 లేదా రూ.1000 చెల్లించాలి. మీరు ఎంచుకున్న ప్లాన్ ని బట్టి ఇది ఆధారపడి ఉంటుంది. బిల్ లో జీఎస్టీ అదనంగా ఉంటుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.