డెయిలీ 2జిబి డేటా అందించే Jio రీచార్జ్ ప్లాన్స్

భారతదేశంలోని టెలీకామ్ కంపెనీల్లో మొదటిస్థానంలో దూసుకెళ్తోంది జియో. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానికి చెందిన జియో కంపెనీ, అంతకు ముందు టాప్ పొజిషన్ లో ఉన్న ఎయిర్టెల్ ని రెండో స్థానంలోకి నెట్టివేసి, అత్యధిక సబ్‌స్క్రైబర్లతో బలమైన స్థానంలో ఉంది. ఇక మూడు, నాలుగు స్థానాల్లో వొడాఫోన్ ఐడియా, బీఎస్ఎన్ఎల్ సంస్థలు ఉన్నాయి. వీఐ ఇంకా 5జీ సేవలను లాంచ్ చేయాల్సి ఉండగా, బీఎస్ఎన్ఎల్ కంపెనీ తన 4జీ సేవలను దేశ వ్యాప్తం చేసేందుకు కృషి చేస్తోంది.

విషయంలోకి వెళ్తే, రిలయన్స్ జియో వద్ద తన వినియోగదారుల కోసం రకరకాల రీచార్జ్ ప్లాన్స్ అందుబాటులో ఉన్నాయి. ప్రధానంగా ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం ఎన్నో డేటా ప్లాన్స్ జియో వద్ద ఉన్నాయి. ఈ ఆర్టికల్ లో డెయిలీ 2జిబి డేటా అందించే జియో ప్లాన్స్ ఏంటో తెలుసుకుందాం. ఆ జాబితాపై ఓ కన్నేయండి మరి.

ప్రతీరోజూ 2జిబి డేటా అందించే Jio రీచార్జ్ ప్లాన్స్

  • Jio రూ.155 ప్లాన్
  • Jio రూ.249 ప్లాన్
  • Jio రూ.533 ప్లాన్
  • Jio రూ.589 ప్లాన్
  • Jio రూ.719 ప్లాన్
  • Jio రూ.2,879 ప్లాన్
  • Jio రూ.2,998 ప్లాన్

1. Jio రూ.155 ప్లాన్: రూ.155 విలువగల ఈ జియో ప్లాన్ ద్వారా యూజర్ కి 2జిబి డేటా లభిస్తుంది. ఈ ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటీని కలిగి ఉంటుంది. ఈ ప్లాన్ తో డేటా, ఉచిత కాలింగ్ తో పాటు 300 ఎస్ఎంఎస్ లభిస్తాయి.

2. Jio రూ.249 ప్లాన్: ఈ జియో ప్లాన్ ద్వారా అపరిమిత వాయిస్ కాలింగ్ సౌకర్యం పొందవచ్చు.

3. Jio రూ.299 ప్లాన్: ఈ ప్లాన్ ద్వారా యూజర్ కి డెయిలీ 2జిబి 4జీ డేటా లభిస్తుంది. ఈ ప్లాన్ 28 రోజుల పాటు చెల్లుబాటు అవుతుంది. ఈ ప్లాన్ ద్వారా అపరిమిత వాయిస్ కాలింగ్, డెయిలీ 100 ఎస్ఎంఎస్ లభిస్తాయి.

4. Jio రూ.533 ప్లాన్: ఈ ప్లాన్ రీచార్జ్ చేసుకునే వారికి, డెయిలీ 2జిబి డేటా లభిస్తుంది. ఈ ప్లాన్ 56 రోజుల పాటు చెల్లుబాటు అవుతుంది. అంతేకాదు, అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్, డెయిలీ 100 ఎస్ఎంఎస్ లభిస్తాయి. ఈ ప్లాన్ ద్వారా జియో యాప్స్ కూడా లభిస్తాయి.

5. Jio రూ.589 ప్లాన్: ఈ ప్లాన్ ద్వారా 56 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. ఇంకా డెయిలీ 2జిబి డేటాను యూజర్స్ పొందుతారు. దీంతో పాటు, యాడ్-ఫ్రీ మ్యూజిక్, అన్‌లిమిటెడ్ జియో ట్యూన్ బెనిఫిట్స్ యూజర్ కి లభిస్తాయి. ఈ ప్లాన్ ద్వారా ఇంకా అపరిమిత వాయిస్ కాలింగ్, ఎస్ఎంఎస్ లభిస్తాయి.

6. Jio రూ.719 ప్లాన్: ఈ ప్లాన్ ద్వారా డెయిలీ 2జిబి డేటా లభిస్తుంది. ఈ ప్లాన్ 84 రోజుల వరకు చెల్లుబాటు అవుతుంది. దాంతో పాటు, అపరిమిత కాలింగ్, డెయిలీ 100 ఎస్ఎంఎస్, జియో యాప్స్ లభిస్తాయి.

7. Jio రూ.789 ప్లాన్: ఈ ప్లాన్ ద్వారా 84 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. ఈ ప్లాన్ తో డెయిలీ 2జిబి డేటా, యాడ్-ఫ్రీ మ్యూజిక్, అపరిమిత జియో ట్యూన్ బెనిఫిట్స్ లభిస్తాయి. ఇంకా అపరిమిత కాలింగ్, ఎస్ఎంఎస్ బెనిఫిట్స్ లభిస్తాయి.

8. Jio రూ.2,879 ప్లాన్: ఈ ప్లాన్ ద్వారా కస్టమర్ కి 365 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. ఇంకా డెయిలీ 2జిబి డేటా లభిస్తుంది. ఇంకా అపరిమిత కాల్స్ లభిస్తాయి.