Jio Annual Plans: ఏడాది వ్యాలిడిటీ అందించే Jio ప్రీపెయిడ్ ప్లాన్స్

భారతదేశంలో ఉన్న టెలీకామ్ సంస్థల్లో అగ్ర స్థానంలో ఉంది రిలయన్స్ జియో. ఈ కంపెనీకి ఎయిర్టెల్ సంస్థ గట్టి పోటీనిస్తోంది. మూడో స్థానంలో ఉన్న వొడాఫోన్ ఐడియా మార్కెట్ లో నిలబడేందుకు బాగా శ్రమిస్తోంది. ఇక ప్రభుత్వరంగ సంస్థ అయిన బీఎస్ఎన్ఎల్ ఇప్పుడిప్పుడే కేంద్ర ప్రభుత్వ ప్యాకేజీతో 4జీ కి అప్‌గ్రేడ్ అవుతోంది. టీసీఎస్ సంస్థ సహకారంతో 4జీ, 5జీ నెట్వర్క్ ల ఏర్పాటు దిశగా బీఎస్ఎన్ఎల్ అడుగులు వేస్తోంది.

ఇక జియో సంస్థ అన్ని రకాల బడ్జెట్ శ్రేణుల్లో వివిధ ప్లాన్స్ ని ఆఫర్ చేస్తోంది. అయితే అధిక వ్యాలిడిటీ అందించే ప్లాన్స్ కి ఎప్పుడు కూడా డిమాండ్ ఉంటుందన్న సంగతి తెలిసిందే. మరి జియో వద్ద కూడా అటువంటి ప్రీపెయిడ్ ప్లాన్స్ ఉన్నాయి. అవి ఏడాది పాటు వ్యాలిడిటీ అందిస్తాయి. సరే, ఆ ప్లాన్స్ వివరాలను మీకోసం అందిస్తున్నాం. ఓసారి చదివి తెలుసుకోండి.

Jio అందిస్తోన్న ఏడాది వ్యాలిడిటీ గల ప్రీపెయిడ్ ప్లాన్స్

  • రూ.2999 ఇండిపెండెన్స్ ఆఫర్
  • రూ.2545 ప్రీపెయిడ్ ప్లాన్

రూ.2,999 ప్రీపెయిడ్ ప్లాన్ ప్రయోజనాలు

ఈ ప్లాన్ ద్వారా కస్టమర్ కి 365 రోజుల వ్యాలిడిటీ, 2.5జిబి డెయిలీ డేటా లభిస్తుంది. ఇంకా అపరిమిత కాల్స్, డెయిలీ 100 ఎస్ఎంఎస్ లభిస్తాయి. అలాగే ఈ ప్లాన్ ద్వారా జియో సినిమా, జియో టీవీ, జియో క్లౌడ్ వంటి అదనపు ప్రయోజనాలు లభిస్తాయి. ఇంకా ఈ ప్లాన్ ద్వారా మరిన్ని బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. అవేంటో ఇక్కడ అందిస్తున్నాం. ఓసారి చదివి తెలుసుకోండి.

రూ.2,999 అదనపు ప్రయోజనాలు

  • రూ.249 విలువగల స్విగ్గీ ఆర్డర్స్ పై రూ.100 డిస్కౌంట్
  • యాత్ర ద్వారా చేసే ఫ్లైట్ బుకింగ్స్ పై రూ.1,500 వరకు తగ్గింపు
  • యాత్ర ద్వారా చేసే డొమెస్టిక్ హోటల్ బుకింగ్ పై 15 శాతం డిస్కౌంట్
  • అజియో లో రూ.999 పైబడి కొనుగోలు చేసే ఎంపిక చేయబడిన ప్రొడక్ట్స్ పై రూ.200 డిస్కౌంట్.
  • రిలయన్స్ డిజిటల్ ద్వారా కొనుగోలు చేసే ఎంపిక చేయబడిన ఆడియో ప్రొడక్ట్స్, గృహోపకరణాలపై 10 శాతం డిస్కౌంట్.
  • జియో తీసుకొచ్చిన ఇండిపెండెన్స్ డే రీచార్జ్ ప్యాక్ 2023 ద్వారా కస్టమర్లకు 365 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది.
  • ఇంకా ప్రతిరోజూ 2.5జిబి డేటా లభిస్తుంది. ఇంకా అపరిమిత కాల్స్, డెయిలీ 100 ఎస్ఎంఎస్ వంటి ప్రయోజనాలు లభిస్తాయి.
  • అధిక వ్యాలిడిటీ, డెయిలీ డేటా కావాలని కోరుకునే వారికి ఈ ప్లన్ బాగా సరిపోతుంది. అలాగే మీరు గనుక టెక్స్ట్ మెసేజెస్ ఎక్కువగా వాడితే రోజూ 100 ఎస్ఎంఎస్ లను ఉపయోగించుకోవచ్చు.

రూ.2545 ప్రీపెయిడ్ ప్లాన్ ప్రయోజనాలు

  • జియో అందిస్తోన్న రూ.2545 రీచార్జ్ ప్లాన్ ద్వారా కస్టమర్లకు 336 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది.
  • ఇంకా ఈ ప్లాన్ ద్వారా ప్రతీ రోజూ 1.5జిబి డేటా లభిస్తుంది.
  • అలాగే ఏ నెట్వర్క్ కి అయినా ఉచితంగా కాల్స్ అపరిమితంగా మాట్లాడుకోవచ్చు.
  • ఇంకా డెయిలీ 100 ఎస్ఎంఎస్ లభిస్తాయి.

ఈ ప్లాన్ ద్వారా కస్టమర్లకు అదనపు ప్రయోజనాలు కూడా లభిస్తాయి. అవేంటో తెలుసుకుందాం పదండి.

రూ.2545 ప్లాన్ అదనపు ప్రయోజనాలు

  • జియో తీసుకొచ్చిన రూ.2545 ప్లాన్ ద్వారా కస్టమర్ కి సాధారణ ప్రయోజనాలతో పాటు అదనంగా జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ వంటి బెనిఫిట్స్ లభిస్తాయి.
  • ఇంకా ఈ ప్లాన్ ద్వారా ఎలిజిబుల్ కస్టమర్లకు అపరిమిత 5జీ డేటా లభిస్తుంది.

ఈ ఆర్టికల్ ద్వారా మీకు జియో అందిస్తోన్న యాన్యువల్ ప్లాన్స్ వివరాలను అందించడం జరిగింది. రూ.2999 ప్లాన్ తో పాటు, రూ.2545 ప్లాన్ సమాచారాన్ని, ప్రయోజనాలను తెలుసుకున్నారు కదా? రెండింట్లో మీ బడ్జెట్ కి తగిన ప్లాన్ ఏదో ఎంచుకోండి. అలాగే రీచార్జ్ చేసుకుని బెనిఫిట్స్ ని ఎంజాయ్ చేయండి.