Jio కస్టమర్లకు శుభవార్త: 21జిబి ఉచిత డేటా అందిస్తోన్న జియో!

Highlights

  • జియో 7వ వార్షికోత్సవం సందర్భంగా సరికొత్త ఆఫర్ ప్రకటన
  • రూ.299, రూ.749, రూ.2,999 ప్లాన్స్ పై ఉచిత డేటా
  • కస్టమర్లకు లభించనున్న 21జిబి అదనపు డేటా

భారతదేశపు అతిపెద్ద టెలీకామ్ కంపెనీ Jio ఈరోజు భారతదేశంలో 7వ ఏట అడుగుపెట్టింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని కంపెనీ ఎంపిక చేసిన రీఛార్జ్ ప్యాక్‌లపై అదనపు డేటా మరియు ప్రత్యేక వోచర్‌లను అందిస్తోంది. ఈ గొప్ప ఆఫర్ నేటి నుండి అంటే సెప్టెంబర్ 5 నుండి సెప్టెంబర్ 30 వరకు వర్తిస్తుంది. జియో అదనపు డేటాను అందిస్తున్న ఎంపిక చేసిన ప్లాన్‌లలో రూ. 299, రూ. 749 మరియు రూ. 2,999 ప్లాన్‌లు ఉన్నాయి. ఈ వార్షికోత్సవం సందర్భంగా జియో తన వినియోగదారులకు ఎలాంటి ఇతర ప్రయోజనాలను అందిస్తుందో తెలుసుకుందాం పదండి.

Jio రూ.299 ప్లాన్ బెనిఫిట్స్

  • జియో రూ.299 ప్రీపెయిడ్ ప్లాన్ ద్వారా కస్టమర్లకు 7జిబి అదనపు డేటా లభిస్తుంది. జియో 7వ వార్షికోత్సవ ఆఫర్ లో భాగంగా ఈ బెనిఫిట్ అందిస్తున్నారు.
  • ఈ ప్లాన్ లో భాగంగా కస్టమర్లకు డెయిలీ 2జిబి డేటా లభిస్తుంది. దీంతో పాటు అపరిమిత ఉచిత కాలింగ్, డెయిలీ 100 ఎస్ఎంఎస్ లభిస్తాయి.

Jio రూ.749 ప్లాన్

  • ఈ ప్లాన్ ద్వారా కస్టమర్లకు 14జిబి డేటా లభిస్తుంది. అంటే రెండు 7జిబి డేటా కూపన్స్ కస్టమర్ కి లభిస్తాయి.
  • ఈ ప్లాన్ ద్వారా ఇంకా అపరిమిత వాయిస్ కాల్స్, డెయిలీ 100 ఉచిత ఎస్ఎంఎస్ లభిస్తాయి. ఈ ప్లాన్ 90 రోజుల పాటు చెల్లుబాటులో ఉంటుంది.

Jio రూ.2,999 ప్లాన్

  • జియో తీసుకొచ్చిన రూ.2,999 ప్లాన్ ద్వారా కస్టమర్లకు 21జిబి ఉచిత డేటా లభిస్తుంది. ఈ డేటా మూడు 7జిబి డేటా కూపన్స్ ద్వారా కస్టమర్ కి లభిస్తాయి.
  • రూ.2,999 ప్లాన్ ద్వారా ఇంకా డెయిలీ 2.5జిబి డేటా, అపరిమిత ఉచిత వాయిస్ కాల్స్, డెయిలీ 100 ఎస్ఎంఎస్, 365 రోజుల వ్యాలిడిటీ వంటి ప్రయోజనాలు లభిస్తాయి.
  • అంతేకాదు ఈ ప్లాన్ ద్వారా కస్టమర్స్ కి Ajio యాప్ లో రూ.200 డిస్కౌంట్, Netmeds లో 20 శాతం డిస్కౌంట్ (రూ.2,800 వరకు) వోచర్స్, స్విగ్గీలో రూ.100 డిస్కౌంట్, రూ.2,149 పైన ఆర్డర్స్ పై మెక్‌డోనాల్డ్స్ ఉచిత మీల్, రిలయన్స్ డిజిటల్ లో 10 శాతం డిస్కౌంట్, యాత్ర ద్వారా హోటల్స్ బుకింగ్స్ పై 15 శాతం డిస్కౌంట్ వంటి ప్రయోజనాలు లభిస్తాయి.

గమనిక: పైన పేర్కొన్న అదనపు ప్రయోజనాలు రీఛార్జ్ చేసిన వెంటనే కస్టమర్ యొక్క MyJio ఖాతాకు జమ చేయబడతాయి. అదనపు డేటా MyJio యాప్‌లో డేటా వోచర్‌లుగా క్రెడిట్ చేయబడుతుంది. వినియోగదారులు వాటిని మాన్యువల్‌గా రీడీమ్ చేసుకోవాలి. వినియోగదారులు జియో వెబ్‌సైట్, MyJio యాప్, థర్డ్ పార్టీ రీఛార్జ్ ప్లాట్‌ఫారమ్‌లు మరియు రూ. 299, రూ. 749 మరియు రూ. 2,999 ప్లాన్‌లతో ఇప్పటికే ఉన్న అన్ని చెక్‌పాయింట్ల ద్వారా రీఛార్జ్ చేసుకోవచ్చు.