1000 పట్టణాలకు పూర్తైన Jio 5G రోలౌట్ ప్లాన్స్

హైలైట్స్:

  • భారత్ లో 1000 పట్టణాలకు 5జీ రోలౌట్ ప్లాన్ ని పూర్తి చేసిన రిలయన్స్ ఇండస్ట్రీస్
  • దేశ వ్యాప్తంగా 9 నగరాల్లో మొదలు కానున్న 5జీ సేవలు
  • ఆగస్టులోనే జియో 5జీ సేవలు ప్రారంభమవుతాయని తెలిపిన ఆకాశ్ అంబాని

శనివారం ఇష్యూ అయిన రిలయన్స్ ఇండస్ట్రీస్ యొక్క సంవత్సరాది నివేదిక ద్వారా కంపెనీ టెలీకామ్ విభాగం అయిన రిలయన్స్ జియో యొక్క 5జీ రోలౌట్ ప్లాన్స్ రివీల్ అయ్యాయి. రిపోర్ట్ ప్రకారం, భారత్ లోని 1000 పట్టణాలకు జియో 5జీ కవరేజ్ ప్లాన్ ని పూర్తి చేసింది. మొదటి దశలో 22 నగరాల్లో 5జీ నెట్వర్క్ ప్రారంభం కానుంది. హీట్ మ్యాప్స్, 3డీ మ్యాప్స్, రే ట్రేసింగ్ టెక్నాలజీస్ ని ఉపయోగించి క్లైంట్ యూసేజ్, రెవెన్యూ పాసిబిలిటీస్ ని టార్గెట్ చేస్తూ కవరేజ్ ప్లానింగ్ ని చేశారు.

ఇటీవలె ముగిసిన 5జీ స్పెక్ట్రమ్ వేలంలో రిలయన్స్ జియో టాప్ బిడ్డర్ గా నిలిచింది. అలాగే ప్రీమియమ్ 700 మెగాహెర్ట్జ్ బ్యాండ్ ని సొంతం చేసుకుంది. ఈ బ్యాండ్ ద్వారా తక్కువ టవర్లను ఉపయోగించి ఎక్కువ దూరం కవరేజీని అందించవచ్చు. వేలం తర్వాత, జియో చైర్మన్ ఆకాశ్ అంబాని మాట్లాడుతూ, ఆగస్టు లోనే 5జీ సేవలను లాంచ్ చేస్తామని వెల్లడించారు.

భారత్ లో Jio 5G రోలౌట్

5జీ స్పెక్ట్రమ్ వేలం ద్వారా భారత ప్రభుత్వానికి బిడ్స్ రూపంలో మొత్తం రూ.1.5 లక్షల కోట్లు (71 శాతం) సమకూరాయి. 5జీ స్పెక్ట్రమ్ వేలంలో అందరూ ఊహించినట్లుగానే, రిలయన్స్ జియో హయ్యస్ట్ బిడ్డర్ గా నిలిచింది. 24,740 మెగాహెర్ట్జ్ 5జీ స్పెక్ట్రమ్ కోసం రూ.88,078 కోట్లను జియో వెచ్చించింది. 700 మెగాహెర్ట్జ్, 800 మెగాహెర్ట్జ్, 1,800 మెగాహెర్ట్జ్, 3,300 మెగాహెర్ట్జ్, 26 గిగాహెర్ట్జ్ బ్యాండ్స్ లో ఉన్న స్పెక్ట్రమ్ కి జియో యాక్సెస్ ను పొందింది.

తొలుత ముంబై, నవీ ముంబై, జాంనగర్, హైదరాబాద్, లక్నో తదితర నగరాలకు 5జీ సేవలు అందిస్తామని రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రెసిడెంట్ కిరణ్ థామస్ తెలిపారు. ఈ నగరాల్లో విస్తృతంగా 5జీ ట్రయల్స్ నిర్వహించిన కారణంగా, వీటిని తొలిదశ 5జీ రోలౌట్ కి ఎంపిక చేశారు. జియో 5జీ సేవలు కంపెనీ యొక్క ఇండీజీనస్ 5జీ స్టాక్ ద్వారా అందించబడుతాయి.

6జీ లో రీసెర్చి, స్టాండర్డైజేషన్ కొరకు జియో, ఫిన్లాండ్ లోని యూనివర్శిటీ ఆఫ్ ఊలు తో జట్టుకట్టింది. ప్రస్తుతం వరల్డ్ 6జీ రీసెర్చ్ ప్రోగ్రామ్ కి ఊలు యూనివర్శిటీ ఇన్‌చార్జ్ గా వ్యవహరిస్తోంది.

5జీ టెక్నాలజీ, ప్రస్తుతం ఉన్న 4జీ కంటే పదింతలు వేగవంతమైన డౌన్‌లోడ్ స్పీడ్స్ ని అందిస్తుందని డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలీకామ్ అంచనా వేస్తోంది. అయితే ఈ స్పీడ్ తో కూడిన సేవలకు డబ్బులు ఎక్కువగా చెల్లించాల్సి ఉంటుంది. 4జీ డేటా ప్లాన్స్ కంటే 5జీ ప్లాన్స్ కనీసం 30 శాతం అధికంగా ఉండనున్నట్లు సమాచారం. త్వరలోనే డేటా ప్లాన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయో స్పష్టత రానుంది. కాగా, ఆగస్టు 15 న 5జీ కి సంబంధించిన ఏదైనా ప్రకటన వచ్చే అవకాశం ఉంది.