12GB ర్యామ్‌, 5000mAh బ్యాటరీతో ఫిలిప్పైన్స్‌లో లాంచైన itel RS4

Highlights

  • ఫిలిప్పైన్స్‌లో itel RS4 లాంచ్
  • 50ఎంపి ప్రైమరీ కెమెరా
  • హీలియో జీ99 చిప్సెట్

చవకైన స్మార్ట్‌ఫోన్లను వినియోగదారులకు అందిస్తూ తనకంటూ ఒక గుర్తింపుని Itel కంపెనీ సంపాదించింది. ఈ బ్రాండ్ నుంచి తరచూ ఏదో ఒక ఫోన్ లాంచ్ అవుతూనే ఉంటుంది. తాజాగా itel RS4 అనే స్మార్ట్‌ఫోన్‌ని ఐటెల్ లాంచ్ చేసింది. ఈ ఫోన్ ఫిలిప్పైన్స్ లో లాంచ్ అయ్యింది. 12జిబి ర్యామ్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, మీడియాటెక్ హీలియో జీ99 చిప్సెట్, 50ఎంపి కెమెరా వంటి స్పెసిఫికేషన్స్ ఈ ఫోన్‌లో ఉన్నాయి. ఓసారి ఐటెల్ ఆర్ఎస్‌4 యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

itel RS4 స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: itel RS4 డివైజ్ లో 6.56-ఇంచ్ హెచ్డీ+ స్క్రీన్, 1612*720 పిక్సెల్స్ రెజుల్యూషన్, ఐపీఎస్ ఎల్సీడీ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.

ప్రాసెసర్: itel RS4 లో మీడియాటెక్ హీలియో జీ99 చిప్సెట్ వాడారు. దీని హై క్లాక్ స్పీడ్ 2.2GHz. గ్రాఫిక్స్ కోసం మాలి-జీ57 జీపీయూ ఉపయోగించారు.

కెమెరా: itel RS4 లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, ఏఐ సెకండరీ లెన్స్ ఉన్నాయి. వీటికి తోడు ఒక ఎల్ఈడీ ఫ్లాష్ ఉంది. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

బ్యాటరీ: itel RS4 లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

కనెక్టివిటీ: itel RS4 లో డ్యూయల్ సిమ్, 4జీ, బ్లూటూత్, వై-ఫై వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి.