itel P55+ ఇండియా లాంచ్ తేదీ ఖరారు; రివీలైన ప్రధాన స్పెసిఫికేషన్స్

Highlights

  • ఫిబ్రవరి 8న లాంచ్ కానున్న itel P55+
  • వీగన్ లెదర్ ఫినిషింగ్ తో వస్తోన్న డివైజ్
  • itel P55+ ధర రూ.10,000 లోపు ఉండే ఛాన్స్

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ కంపెనీ itel త్వరలో భారతీయ మార్కెట్ లో itel P55+ అనే డివైజ్ ని లాంచ్ చేయనుంది. తాజాగా ఈ ఫోన్ యొక్క లాంచ్ తేదీ ఖరారైంది. అలాగే ప్రధాన స్పెసిఫికేషన్స్ కూడా రివీల్ అయ్యాయి. itel P55+ స్మార్ట్‌ఫోన్ భారత్ లో ఫిబ్రవరి 8వ తేదీన లాంచ్ అవుతుందని కంపెనీ వెల్లడించింది. ఈ ఫోన్ వీగన్ లెదర్ ఫినిష్ 3డీ స్టిచింగ్, 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 50ఎంపి కెమెరా వంటి ఫీచర్లతో వస్తున్నట్లు తెలుస్తోంది. సరే, ఓసారి పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి.

itel P55+ ఇండియా లాంచ్ తేదీ, ప్రధాన స్పెసిఫికేషన్స్

  • itel P55+ స్మార్ట్‌ఫోన్ భారత్ లో ఫిబ్రవరి 8వ తేదీన లాంచ్ అవుతుందని కంపెనీ అధికారికంగా వెల్లడించింది.
  • itel P55+ 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, 50ఎంపి మెయిన్ కెమెరా, వీగన్ లెదర్ ఫినిషింగ్, మెమొరీ ఫ్యూజన్ టెక్నాలజీ సాయంతో 16జిబి వరకు ర్యామ్, 256జిబి యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీ వంటి స్పెసిఫికేషన్స్ తో రానుందని అమెజాన్ మైక్రోసైట్ ద్వారా రివీల్ అయ్యింది.
  • itel P55+ ఇప్పటికే గ్లోబల్ గా గత నెలలో లాంచ్ అయ్యింది. సౌతాఫ్రికన్ మార్కెట్ లో itel P55+ కొనుగోలుకి అందుబాటులో ఉంది.
  • itel P55+ ఇండియన్ వేరియంట్ గ్లోబల్ మోడల్ మాదిరే ఉంటుందని అంచనా వేయవచ్చు.
  • itel P55+ యొక్క గ్లోబల్ వేరియంట్ స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి.

itel P55+ గ్లోబల్ వేరియంట్ స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: itel P55+ లో 6.6-ఇంచ్ హెచ్డీ+ స్క్రీన్, 720*1612 పిక్సెల్స్ రెజుల్యూషన్, ఐపీఎస్ ఎల్సీడీ ప్యానెల్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: itel P55+ లో Unisoc T606 చిప్సెట్ వాడారు. ఇది 12 నానోమీటర్ ప్రాసెస్ పై తయారైంది. గ్రాఫిక్స్ కోసం మాలి జీ57 ఎంపీ1 జీపీయూ వినియోగించారు.
  • ర్యామ్, స్టోరేజీ: itel P55+ డివైజ్ 4జిబి/6జిబి/8జిబి ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ వేరియంట్స్ లో లభిస్తుంది. ఇంకా ఈ డివైజ్ 4జిబి/6జిబి/8జిబి వర్చువల్ ర్యామ్ కి సపోర్ట్ చేస్తుంది. అలాగే మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో మెమొరీని పెంచుకునే వీలుంది.
  • కెమెరా: itel P55+ లో 50ఎంపి మెయిన్ కెమెరా, సెకండరీ ఏఐ లెన్స్, ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. ఇంకా పనోరమా మోడ్, సూపర్ నైట్ మోడ్, ఏఐ క్లియర్ పొట్రెయిట్, ప్రో మోడ్, టైమ్ ల్యాప్స్ మోడ్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • కనెక్టివిటీ: itel P55+ లో డ్యూయల్ 4జీ వొల్టీ, వై-ఫై, బ్లూటూత్ 5.1, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, యూఎస్బీ 2.0 వంటి ఆప్షన్స్ ఉన్నాయి.
  • బ్యాటరీ, చార్జింగ్: itel P55+ లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్‌కి సపోర్ట్ చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: itel P55+ లో భద్రత కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు.