రూ.7,000 కంటే తక్కువ ధరతో భారత్‌లో లాంచ్ కానున్న itel A60S

Highlights

  • అమెజాన్ లో ప్రత్యక్షమైన itel A60S టీజర్
  • కొన్ని రోజుల్లో లాంచ్ కానున్న ఫోన్
  • వాటర్‌డ్రాప్ నాచ్ తో వస్తోన్న డివైజ్

తక్కువ ధరలో చక్కటి ఫోన్లను అందిస్తోంది Itel కంపెనీ. ఈ సంస్థ నుంచి భారతీయ యూజర్ల కోసం itel A60S స్మార్ట్ ఫోన్ ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది. తాజాగా ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ అమెజాన్ తో ఈ స్మార్ట్ ఫోన్ టీజర్ ప్రత్యక్షమైంది. ఈ స్మార్ట్ ఫోన్ మెమొరీ ఫ్యూజన్ టెక్నాలజీ సాయంతో 8జిబి ర్యామ్ వరకు ఆఫర్ చేయగలదు. ఈ ఫోన్ ధర రూ.7 వేల లోపే ఉంటుందని సమాచారం. సరే, ఓసారి itel A60S డివైజ్ స్పెసిఫికేషన్స్, లాంచ్ వివరాలను తెలుసుకుందాం పదండి.

itel A60S ఎప్పుడు లాంచ్ అవుతుంది?

itel A60S స్మార్ట్ ఫోన్ టీజర్ ఈ-కామర్స్ వెబ్ సైట్ అమెజాన్ లో కనిపించింది. ఈ టీజర్ లో స్పెషల్ స్పెసిఫికేషన్స్ తో పాటు బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ ఫోన్ తో కనిపిస్తున్నారు. ఈ ఫోన్ కొన్ని రోజుల్లో లాంచ్ కానుందని తెలుస్తోంది. itel A60S డివైజ్ రూ.7,000 కంటే తక్కువ ధరతో భారత్ లో లాంచ్ అవుతుందని టీజర్ లో కంపెనీ వెల్లడించింది.

itel A60S స్పెసిఫికేషన్స్

  • డిజైన్: itel A60S డివైజ్ లో వాటర్ డ్రాప్ నాచ్, స్క్వేర్ షేప్ కెమెరా మాడ్యూల్, ఎల్ఈడీ ఫ్లాష్, రెండు కెమెరాలు, ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నాయి.
  • ర్యామ్, స్టోరేజీ: itel A60S డివైజ్ 4జిబి ర్యామ్, 4జిబి వర్చువల్ ర్యామ్ తో వస్తోంది. 64జిబి స్టోరేజీని ఈ ఫోన్ లో అందించారు.
  • డిస్ప్లే: itel A60S స్మార్ట్ ఫోన్ గత వారం నైజీరియాలో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ లో 6.6-ఇంచ్ హెచ్డీ+ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే, 720*1600 పిక్సెల్ రెజుల్యూషన్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: itel A60S డివైజ్ లో UniSoc SC9863A1 అనే చిప్ ని వాడారు. ఈ చిప్ 1.6 గిగాహెర్ట్జ్ క్లాక్ స్పీడ్ కలిగి ఉంటుంది.
  • కెమెరా: itel A60S స్మార్ట్ ఫోన్ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 8ఎంపి మెయిన్ కెమెరా ఉంటుంది. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 5ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
  • బ్యాటరీ: itel A60S డివైజ్ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది.
  • ఇతర ఫీచర్లు: itel A60S స్మార్ట్ ఫోన్ లో మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్, వై-ఫై, బ్లూటూత్, డ్యూయల్ సిమ్ ఉంటాయి.