iQOO: 6000mAh బ్యాటరీతో వస్తోన్న Z9 Turbo

Highlights

  • త్వరలో iQOO Z9 Turbo లాంచ్
  • స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 3 చిప్సెట్
  • డ్యూయల్ రియర్ కెమెరా సెటప్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo యొక్క సబ్-బ్రాండ్ iQOO నుంచి త్వరలో ఒక కొత్త జెడ్-సిరీస్ ఫోన్ లాంచ్ కానుంది. iQOO Z9 Turbo పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి వస్తోంది. ఈ ఫోన్ ఇదే నెలలో లాంచ్ అవుతుందని ఐకూ ప్రొడక్ట్ మేనేజర్ జెంగ్ చింగ్ చైనాకు చెందిన సామాజిక మాధ్యమం Weibo ద్వారా తెలిపారు. అయితే, లాంచ్ తేదీ గురించి ఏ వివరాలు పేర్కొనలేదు. కానీ, ఇప్పుడు కంపెనీ iQOO Z9 Turbo యొక్క అఫీషియల్ లుక్ మరియు కొన్ని ప్రత్యేక ఫీచర్లను టీజర్ చేసింది.

iQOO Z9 Turbo డిజైన్

iQOO Z9 Turbo ఫోన్ డిజైన్ ఐకూ 12 స్మార్ట్‌ఫోన్ మాదిరి ఉంటుందని షేర్ చేసిన ఇమేజ్ ద్వారా తెలుస్తోంది. బ్యాక్ ప్యానెల్ పై డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ కనిపిస్తోంది. కెమెరా మాడ్యూల్ డిజైన్ ఐకూ 12 లో ఉన్నట్లుగానే ఉంది.

iQOO Z9 Turbo ఫోన్ “ఇండిపెండెంట్ గ్రాఫిక్స్ చిప్” తో వస్తున్నట్లు వివో వైస్ ప్రెసిడెంట్ జియా జింగ్‌డాంగ్ తెలిపారు.

iQOO Z9 Turbo స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: లీక్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ ప్రకారం, iQOO Z9 Turbo లో 1.5కే స్క్రీన్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఓఎల్ఈడీ ఫ్లాట్ ప్యానెల్ ఉంటాయి.
  • ప్రాసెసర్: iQOO Z9 Turbo లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 3 చిప్సెట్ ఉంటుంది. రెడ్మీ టర్బో 3 లో కూడా ఇదే చిప్సెట్ ఉంటుంది. అంటే రెండూ ఒకదానికొకటి పోటీ పడనున్నాయని తెలుస్తోంది.
  • ర్యామ్, స్టోరేజీ: iQOO Z9 Turbo డివైజ్ 12జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ మరియు 16జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ మోడల్స్ లో లాంచ్ కానుంది.
  • బ్యాటరీ: iQOO Z9 Turbo లో పవర్ బ్యాకప్ కోసం 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుందని ఐకూ కన్ఫర్మ్ చేసింది. 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో ఈ ఫోన్ వస్తుందని సమాచారం.
  • కెమెరా: iQOO Z9 Turbo లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుందని రివీలైన డిజైన్ ద్వారా తెలుస్తోంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
  • ఓఎస్: iQOO Z9 Turbo డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ఓఎస్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • సెక్యూరిటీ: iQOO Z9 Turbo లో భద్రత కోసం ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటుంది.