iQOO Z9 Lite 5G స్పెసిఫికేషన్స్ ఖరారు, ఐపీ64 రేటింగ్‌తో వస్తోన్న డివైజ్

Highlights

  • జులై 15న iQOO Z9 Lite 5G లాంచ్
  • డైమెన్సిటీ 6300 చిప్సెట్
  • 50ఎంపి కెమెరా

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ iQOO నుంచి త్వరలో జెడ్-సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ కానుంది. iQOO Z9 Lite 5G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. జులై 15వ తేదీన ఈ ఫోన్ భారత్ లో లాంచ్ అవుతోంది. తాజాగా ఈ ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్‌ను కంపెనీ కన్ఫర్మ్ చేసింది. ఆ వివరాలు తెలుసుకుందాం పదండి.

iQOO Z9 Lite 5G స్పెసిఫికేషన్స్ (ఖరారైనవి)

iQOO Z9 Lite 5G స్మార్ట్‌ఫోన్ అమెజాన్ ద్వారా సేల్‌కి వస్తోంది. ఇప్పటికే మైక్రోసైట్ కూడా దర్శనమిస్తోంది.

iQOO Z9 Lite 5G డివైజ్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్సెట్ తో వస్తోంది. ఈ చిప్ యొక్క హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.4 గిగాహెర్ట్జ్.

iQOO Z9 Lite 5G లో 6జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ అందించనున్నట్లు కన్ఫర్మ్ అయ్యింది. ఇతర మోడల్స్ కూడా లాంచ్ రోజున రివీల్ అయ్యే అవకాశం ఉంది.

iQOO Z9 Lite 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి బొకే కెమెరా ఉంటాయి. సెల్ఫీ కెమెరా వివరాలు ఇంకా తెలియలేదు.

iQOO Z9 Lite 5G డివైజ్ ఐపీ64 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్ తో వస్తోంది. దీంతో నీరు, దుమ్ము నుంచి ఈ ఫోన్‌కి రక్షణ లభించనుంది.

iQOO Z9 Lite 5G డివైజ్ ఆక్వా ఫ్లో (బ్లూ), మోకా బ్రౌన్ కలర్ ఆప్షన్స్ లో లాంచ్ అవుతోంది.

iQOO Z9 Lite 5G డివైజ్ కొన్ని రోజుల క్రితం లాంచైన Vivo T3 Lite కి రీబ్రాండ్ వర్షన్ అని నివేదికల ద్వారా తెలుస్తోంది.

దీంతో వివో టీ3 లైట్ 5జీ లో ఉన్న స్పెసిఫికేషన్స్ ఐకూ జెడ్9 లైట్ 5జీ లో ఉంటాయని భావిస్తున్నారు.

Vivo T3 Lite 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Vivo T3 Lite లో 6.56-ఇంచ్ స్క్రీన్, 1612*720 పిక్సెల్స్ రెజుల్యూషన్, ఎల్సీడీ ప్యానెల్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 840 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి.

ప్రాసెసర్: Vivo T3 Lite స్మార్ట్‌ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్సెట్ వాడారు.

మెమొరీ: Vivo T3 Lite డివైజ్ 4జిబి/6జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ వేరియంట్స్ లో లభిస్తుంది. 6జిబి వర్చువల్ ర్యామ్ ఫీచర్‌ను ఈ ఫోన్ లో అందించారు. దీంతో యూజర్‌కి గరిష్టంగా 12జిబి ర్యామ్ పవర్ లభిస్తుంది.

కెమెరా: Vivo T3 Lite లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి సోని ఐఎంఎక్స్852 ఏఐ సెన్సర్ ఉంది. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి హెచ్డీ ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.

బ్యాటరీ: Vivo T3 Lite లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 15 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

ఓఎస్: Vivo T3 Lite డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

కనెక్టివిటీ: Vivo T3 Lite లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

ఇతర ఫీచర్లు: Vivo T3 Lite లో ఐపీ64 రేటింగ్, సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉన్నాయి.