iQOO Z9 Lite 5G: జులై 15న లాంచ్ అవుతోన్న ఐకూ జీ9 లైట్ 5జీ

Highlights

  • iQOO Z9 Lite 5G ఇండియా లాంచ్ ఖరారు
  • జులై 15న లాంచ్ అవుతోన్న డివైజ్
  • మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్సెట్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ iQOO నుంచి త్వరలో జెడ్-సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ కానుంది. iQOO Z9 Lite 5G పేరుతో ఈ ఫోన్ భారతీయ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. తాజాగా ఈ ఫోన్ యొక్క ఇండియా లాంచ్ తేదీ ఖరారైంది. జులై 15న ఐకూ జెడ్9 లైట్ 5జీ లాంచ్ అవుతోంది. మీడియాటెక్ డైమెన్సిటీ చిప్సెట్ తో ఈ ఫోన్ వస్తోంది. ఓసారి లాంచ్ వివరాలు, అంచనా ధర మరియు స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

iQOO Z9 Lite 5G ధర (లీక్)

iQOO Z9 Lite 5G డివైజ్ తక్కువ బడ్జెట్ లో లాంచ్ అవుతోంది. ప్రస్తుతం జెడ్9 లైట్ 5జీ ప్రొడక్ట్ పేజీ అమెజాన్‌పై దర్శనమిస్తోంది. ఈ ఫోన్ ధరను రూ.10,000 లోపు పెట్టే అవకాశం ఉంది. లీక్ ప్రకారం, ఈ ఫోన్ రెండు మెమొరీ వేరియంట్స్ లో లాంచ్ కానుంది. అవి: 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మరియు 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ. 4జిబి మోడల్ ధర రూ.9,999, 6జిబి ర్యామ్ వేరియంట్ ధర రూ.11,999 గా ఉంటుందని అంచనా వేస్తున్నారు.

iQOO Z9 Lite 5G స్పెసిఫికేషన్స్ (లీక్)

డిస్ప్లే: iQOO Z9 Lite 5G లో 6.56-ఇంచ్ హెచ్డీ+ స్క్రీన్, ఎల్సీడీ ప్యానెల్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 840 నిట్స్ బ్రైట్నెస్ ఉంటాయి.

కెమెరా: iQOO Z9 Lite 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉంటాయి. సెల్పీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

బ్యాటరీ: iQOO Z9 Lite 5G డివైజ్ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 15 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోంది.

iQOO Z9 Lite 5G చిప్సెట్ వివరాలు (కన్ఫర్మ్)

iQOO Z9 Lite 5G స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్సెట్ తో వస్తోందని ఐకూ బ్రాండ్ అఫీషియల్ గా వెల్లడించింది. 6 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై ఈ చిప్ తయారైంది. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.4 గిగాహెర్ట్జ్.