iQOO Z9 Lite 5G: జులైలో ఐకూ జీ9 లైట్ 5జీ లాంచ్ అయ్యే అవకాశం

Highlights

  • త్వరలో iQOO Z9 Lite 5G లాంచ్
  • జులైలో లాంచ్ అయ్యే అవకాశం
  • డివైజ్ అంచనా ధర రూ.10,000

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ iQOO నుంచి త్వరలో జెడ్-సిరీస్ లో ఒక కొత్త ఫోన్ లాంచ్ కానుంది. iQOO Z9 Lite 5G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి రానుంది. తక్కువ ధరలోనే ఈ ఫోన్ లాంచ్ అవుతుందని సమాచారం. తాజాగా ఈ ఫోన్ యొక్క లాంచ్ టైమ్ లైన్, కలర్ ఆప్షన్స్ వివరాలు లీక్ అయ్యాయి. జులై లో ఈ ఫోన్ లాంచ్ అవుతుందని సమాచారం. ఓసారి లీకైన వివరాలను తెలుసుకుందాం.

iQOO Z9 Lite 5G లాంచ్ టైమ్‌లైన్, కలర్ ఆప్షన్స్ (లీక్)

ప్రముఖ టిప్‌స్టర్ ముకుల్ శర్మ iQOO Z9 Lite 5G డివైజ్ వివరాలను సోషల్ మీడియా ప్లాట్ఫామ్ X పై షేర్ చేశారు.

iQOO నుంచి వస్తోన్న మొదటి ఎంట్రీ లెవెల్ స్మార్ట్‌ఫోన్‌గా iQOO Z9 Lite 5G నిలవనుంది.

జులై మూడోవారంలో iQOO Z9 Lite 5G భారత్ లో లాంచ్ అయ్యే అవకాశం ఉందని టిప్‌స్టర్ ద్వారా తెలుస్తోంది.

iQOO Z9 Lite 5G స్మార్ట్‌ఫోన్ బ్రౌన్ మరియు బ్లూ కలర్ ఆప్షన్స్ లో లాంచ్ అవుతుందని టిప్‌స్టర్ తెలిపారు.

iQOO Z9 Lite 5G స్మార్ట్‌ఫోన్ Vivo T3 Lite 5G కి రీబ్రాండ్ వర్షన్ అని ఓ నివేదిక ద్వారా తెలుస్తోంది. ఇకపోతే జూన్ 27న వివో టీ3 లైట్ 5జీ భారత్ లో లాంచ్ అవుతోంది. జులై నెలలో iQOO Z9 Lite 5G లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

iQOO Z9 Lite 5G ధర (లీక్)

iQOO Z9 Lite 5G ధర గతంలో కొన్ని లీక్స్ ద్వారా రివీల్ అయ్యింది. రూ.10,000 లోపు ధరలో ఈ ఫోన్ లాంచ్ అవుతుందని అంచనా వేస్తున్నారు. 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.9,999 గా ఉంటుంది. 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.11,999 గా ఉంటుంది.

iQOO Z9 Lite 5G స్పెసిఫికేషన్స్ (అంచనా)

iQOO Z9 Lite 5G స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ తో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

ఇంకా ఈ స్మార్ట్‌ఫోన్ లో 50ఎంపి ఏఐ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుందని అంచనా.

iQOO Z9 Lite 5G డివైజ్ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది.