iQOO Z9 Lite 5G బీఐఎస్, బ్లూటూత్ ఎస్ఐజీ సర్టిఫికేషన్స్ వివరాలు

Highlights

  • త్వరలో iQOO Z9 Lite 5G లాంచ్
  • బీఐఎస్ పై లిస్టైన iQOO Z9 Lite 5G
  • డివైజ్ మోడల్ నంబర్ I2306

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ iQOO నుంచి త్వరలో జీ9 సిరీస్ లో లైట్ వర్షన్ స్మార్ట్‌ఫోన్ లాంచ్ అవుతుంది. iQOO Z9 Lite 5G పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి వస్తోంది. భారత్ లో ఈ ఫోన్ లాంచ్ కోసం ఐకూ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ ఫోన్ బ్లూటూత్ ఎస్ఐజీ తో పాటు భారత్ కి చెందిన బీఐఎస్ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది. ఓసారి ఈ సర్టిఫికేషన్స్ వివరాలు తెలుసుకుందాం.

iQOO Z9 Lite 5G బీఐఎస్, బ్లూటూత్ ఎస్ఐజీ లిస్టింగ్స్

బ్లూటూత్ ఎస్ఐజీ లిస్టింగ్ ద్వారా iQOO Z9 Lite 5G పేరు ఖరారైంది. అలాగే ఫోన్ మోడల్ నంబర్ కూడా రివీల్ అయ్యింది.

iQOO Z9 Lite 5G డివైజ్ I2306 అనే మోడల్ నంబర్ తో బ్లూటూత్ ఎస్ఐజీ పై లిస్ట్ అయ్యింది.

భారత్ కి చెందిన బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) పై I2306 అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.

ఈ రెండు సర్టిఫికేషన్స్ ద్వారా iQOO Z9 Lite 5G కి సంబంధించిన ఇతర వివరాలేవీ బయటకు రాలేదు. కానీ, బీఐఎస్ లిస్టింగ్ ద్వారా త్వరలో iQOO Z9 Lite 5G భారత్ లో లాంచ్ కానుందని స్పష్టమైంది.

iQOO Z9x 5G స్పెసిఫికేషన్స్

స్క్రీన్: iQOO Z9x 5G లో 6.72-ఇంచ్ ఎల్సీడీ డిస్ప్లే, ఫుల్ హెచ్డీ+ (2408*1080 పిక్సెల్స్) రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 1400:1 కాంట్రాస్ట్ రేషియో, 339 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, 91.48% స్క్రీన్-టు-బాడీ రేషియో, సెంటర్డ్ పంచ్ హోల్ కటౌట్ ఉన్నాయి.

ప్రాసెసర్: iQOO Z9x 5G లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 చిప్సెట్, అడ్రెనో 710 జీపీయూ ఉన్నాయి.

ర్యామ్, స్టోరేజీ: iQOO Z9x 5G డివైజ్ 4జిబి/6జిబి/8జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 8జిబి ఎక్స్‌టెండెడ్ ర్యామ్, యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీ ఉన్నాయి. మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో 1టిబి వరకు మెమొరీని పెంచుకునే వీలుంది.

సాఫ్ట్‌వేర్: iQOO Z9x 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

కెమెరా: iQOO Z9x 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి S5KJNSSQ33 ప్రైమరీ సెన్సర్ (f/1.8 అపర్చర్), 2ఎంపి బొకే కెమెరా (f/2.4 అపర్చర్), ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం f/2.05 అపర్చర్ గల 8ఎంపి సెన్సర్ ఇచ్చారు.

బ్యాటరీ, చార్జింగ్: iQOO Z9x 5G లో పవర్ బ్యాకప్ కోసం 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

కనెక్టివిటీ: iQOO Z9x 5G డివైజ్ లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, వై-ఫై, బ్లూటూత్ 5.1, జీపీఎస్, గ్లొనాస్, గెలీలియో, బైడూ, జీఎన్ఎస్ఎస్, క్యూజెడ్ఎస్ఎస్, యూఎస్బీ 2.0 టైప్-సీ పోర్ట్ ఉన్నాయి.