iQOO: భారత్‌లో లాంచ్‌కి ముందు రివీలైన iQOO Neo 9 Pro ప్రీ-బుకింగ్ తేదీ, బెనిఫిట్స్!

Highlights

  • త్వరలో లాంచ్ కానున్న iQOO Neo 9 Pro
  • అమెజాన్, ఐకూ వెబ్‌సైట్స్ ద్వారా సేల్
  • రివీలైన ప్రీ-బుకింగ్ బెనిఫిట్స్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ Vivo యొక్క సబ్-బ్రాండ్ iQOO నుంచి త్వరలో Neo 9 Pro అనే స్మార్ట్‌ఫోన్ భారత్ లో లాంచ్ కానుంది. ఫిబ్రవరి 22న ఈ డివైజ్ ఎంట్రీ ఇస్తోంది. ఇప్పటికే ఈ ఫోన్ కి సంబంధించిన కెమెరా, బ్యాటరీ, చిప్సెట్, ర్యామ్/స్టోరేజీ వివరాలు బయటకు వచ్చాయి. ఇప్పుడు, iQOO Neo 9 Pro ప్రీ-బుకింగ్ వివరాలు రివీల్ అయ్యాయి. iQOO Neo 9 Pro హ్యాండ్సెట్ అమెజాన్ మరియు ఐకూ వెబ్‌సైట్ ద్వారా సేల్ కి రానుంది.

iQOO Neo 9 Pro ఇండియా ప్రీ-బుకింగ్

  • iQOO Neo 9 Pro డివైజ్ భారత్ లో ఫిబ్రవరి 8వ తేదీన మధ్యాహ్నం 12 గంటల నుంచి అమెజాన్ మరియు ఐకూ వెబ్‌సైట్ ద్వారా ప్రీ-బుకింగ్ కి అందుబాటులో ఉంటుందని ఐకూ సంస్థ ప్రకటించింది.
  • ప్రీ-బుకింగ్ ప్రయోజనాలు: iQOO Neo 9 Pro డివైజ్ ని ప్రీ-బుక్ చేసుకునే కస్టమర్లకు రూ.1,000 అదనపు డిస్కౌంట్, 2 ఏళ్ళ వ్యారంటీ మరియు ఎక్స్‌క్లూజివ్ లాంచ్ డేట్ ఆఫర్లు లభిస్తాయి.

ప్రీ-బుకింగ్ చేసుకోవడం ఎలా?

  • కస్టమర్లు iQOO Neo 9 Pro డివైజ్ ని రూ.1,000 రీఫండబుల్ డిపాజిట్ ని చెల్లించి ప్రీ-బుక్ చేసుకోవాలి.
  • iQOO Neo 9 Pro హ్యాండ్సెట్ ని అమెజాన్ మరియు ఐకూ వెబ్‌సైట్స్ ద్వారా ఫిబ్రవరి 8 నుంచి ప్రీ-బుక్ చేసుకోవచ్చు.
  • ప్రీ-బుకింగ్ స్లాట్స్ పరిమిత సంఖ్యలో ఉన్నందున, ముందుగా ఎవరొస్తే వారికి బుకింగ్ సౌకర్యం ఉంటుందని ఐకూ చెబుతోంది.

iQOO Neo 9 Pro స్పెసిఫికేషన్స్

  • స్క్రీన్: iQOO Neo 9 Pro లో 6.78-ఇంచ్ 1.5కే అమోలెడ్ డిస్ప్లే, 2800*1260 పిక్సెల్స్ రెజుల్యూషన్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2160 హెర్ట్జ్ పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్ సపోర్ట్ ఉంటాయి.
  • చిప్సెట్: iQOO Neo 9 Pro లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్, అడ్రెనో జీపీయూ ఉంటాయి.
  • ర్యామ్, స్టోరేజీ: iQOO Neo 9 Pro డివైజ్ 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మరియు 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభించనుంది.
  • కెమెరా: iQOO Neo 9 Pro లో 50ఎంపి సోని ఐఎంఎక్స్920 ప్రైమరీ ఓఐఎస్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ కెమెరా ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
  • బ్యాటరీ: iQOO Neo 9 Pro లో పవర్ బ్యాకప్ కోసం 5,160 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఓఎస్: iQOO Neo 9 Pro డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఒరిజిన్ఓఎస్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.