8GB ర్యామ్‌తో గూగుల్ ప్లే కన్సోల్‌ పై కనిపించిన Infinix Zero 30 5G

Highlights

  • జీరో సిరీస్ లో ఒక కొత్త ఫోన్ ని లాంచ్ చేయనున్న ఇన్ఫినిక్స్
  • Infinix Zero 20 5G కి సక్సెసర్ గా వస్తోన్న Infinix Zero 30 5G
  • గూగుల్ ప్లే కన్సోల్ పై తాజాగా కనిపించిన డివైజ్

స్మార్ట్ ఫోన్ తయారీదారు Infinix త్వరలోనే జీరో సిరీస్ లో ఒక కొత్త ఫోన్ ని లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తోంది. Infinix Zero 30 5G అనే పేరుతో మార్కెట్ లోకి రాబోవు ఈ ఫోన్ తాజాగా గూగుల్ ప్లే కన్సోల్ పై లిస్ట్ అయ్యింది. ఈ సర్టిఫికేషన్ లిస్టింగ్ ద్వారా ప్రధానమైన ఫీచర్లు, స్పెసిఫికేషన్లు రివీల్ అయ్యాయి. సరే, ఓసారి ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

Infinix Zero 30 5G గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్ వివరాలు

గూగుల్ ప్లే కన్సోల్ పై Infinix Zero 30 5G లిస్ట్ అయ్యింది. దీంతో స్పెసిఫికేషన్స్ పై ఓ అవగాహన వచ్చినట్లైంది.

  • డిస్ప్లే: Infinix Zero 30 5G డివైజ్ 1080*2400 పిక్సెల్స్ రెజుల్యూషన్, 480పీపీఐ పిక్సెల్ డెన్సిటీ కలిగి ఉన్నట్లు లిస్టింగ్ లో ఉంది.
  • ఓఎస్: Infinix Zero 30 5G ఫోన్ గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్ పై ఆండ్రాయిడ్ 13 ఓఎస్ తో కనిపించింది.
  • ర్యామ్: Infinix Zero 30 5G డివైజ్ లిస్టింగ్ పై 8జిబి ర్యామ్ తో కనిపించింది. ఈ స్మార్ట్ ఫోన్ మరొక మెమొరీ వేరియంట్ లో కూడా రానుందని అంచనా వేస్తున్నారు.
  • చిప్సెట్: Infinix Zero 30 5G స్మార్ట్ ఫోన్ గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్ పై మీడియాటెక్ డైమెన్సిటీ 1100 ఆక్టా-కోర్ ప్రాసెసర్ తో కనిపించింది. మార్కెట్ లోకి మీడియాటెక్ డైమెన్సిటీ 8020 చిప్ తో రానున్నట్లు సమాచారం.
  • గ్రాఫిక్స్: Infinix Zero 30 5G లో గ్రాఫిక్స్ కోసం 9ఎక్స్ ఏఆర్ఎమ్ మాలి జీ77 జీపీయూ వాడినట్లు లిస్టింగ్ ద్వారా స్పష్టమైంది.

Infinix Zero 30 5G గురించి ఇప్పటి వరకు గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్ ద్వారా తెలిసిన వివరాలు ఇంతే. మనం ఓసారి గత మోడల్ అయిన Infinix Zero 20 5G స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో చెక్ చేద్దాం.

Infinix Zero 20 5G స్పెసిఫికేషన్స్

  • స్క్రీన్: Infinix Zero 20 5G స్మార్ట్ ఫోన్ లో 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ నాచ్ డిస్ప్లే, 1080*2400 పిక్సెల్ రెజుల్యూషన్, అమోలెడ్ ప్యానెల్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.
  • కెమెరా: Infinix Zero 20 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 108ఎంపి మెయిన్ కెమెరా, 13ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. ఇంకా సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ డివైజ్ లో 60ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు. ఈ 60ఎంపి ఫ్రంట్ కెమెరాని ప్రపంచపు ఉత్తమమైన వ్లాగ్ కెమెరాగా ఇన్ఫినిక్స్ అభివర్ణించింది.
  • చిప్సెట్: Infinix Zero 20 5G స్మార్ట్ ఫోన్ లో మీడియాటెక్ హీలియో జీ99 చిప్ వాడారు. ఇది 6 నానోమీటర్ ప్రాసెస్ పై తయారైన చిప్.
  • ర్యామ్, స్టోరేజీ: Infinix Zero 20 5G డివైజ్ లో 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ ఉన్నాయి.
  • బ్యాటరీ: Infinix Zero 20 5G డివైజ్ లో పవర్ బ్యాకప్ కోసం 4500 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.