Infinix Note 40X 5G: లీకైన ఇన్ఫినిక్స్ నోట్ 40ఎక్స్ 5జీ ధర, లైవ్ ఇమేజెస్, స్పెసిఫికేషన్స్

Highlights

  • త్వరలో Infinix Note 40X 5G లాంచ్
  • ఇంకా వెల్లడి కాని అధికార ప్రకటన
  • 6.78-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ డిస్ప్లే

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ Infinix త్వరలో నోట్ 40 సిరీస్ లో ఒక కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. Infinix Note 40X 5G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. కానీ, ఈ ఫోన్ లాంచ్‌కి సంబంధించిన ప్రకటనను కంపెనీ ఇంకా ప్రకటించలేదు. త్వరలోనే ఈ ప్రకటన ఉండే అవకాశం ఉంది. ఈలోపు Infinix Note 40X 5G యొక్క ధర, లైవ్ ఇమేజెస్, స్పెసిఫికేషన్స్ లీక్ అయ్యాయి. ఓసారి ఆ విశేషాలు తెలుసుకుందాం పదండి.

Infinix Note 40X 5G లైవ్ ఇమేజెస్

Infinix Note 40X 5G యొక్క లైవ్ ఇమేజెస్‌ని PassionateGeeks లీక్ చేసింది. రియర్ డిజైన్ మాత్రమే రివీల్ అయ్యింది.

Infinix Note 40X 5G బ్యాక్ ప్యానెల్ పై ట్రిపుల్ కెమెరా సెటప్, ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. చూడటానికి ఆపిల్ లేటెస్ట్ ఐఫోన్ ప్రో మ్యాక్స్ మాదిరి లుక్ కనిపిస్తోంది.

Infinix Note 40X 5G బ్యాక్ ప్యానెల్ గ్లాసీ ఫినిష్‌ను కలిగి ఉంది. అలాగే ఇన్ఫినిక్స్ బ్రాండింగ్ కనిపిస్తోంది. ఇంకా వాల్యూమ్ రాకర్, పవర్ బటన్ ఫోన్‌కి కుడివైపున ఉన్నాయి.

Infinix Note 40X 5G ధర (అంచనా)

ఓ నివేదిక ప్రకారం, Infinix Note 40X 5G డివైజ్ భారతీయ మార్కెట్‌లో తక్కువ బడ్జెట్ లో లాంచ్ కానుందని సమాచారం. ఈ ఫోన్ ధర రూ.10,000 లోపు ఉంటుందని అంచనా వేస్తున్నారు. బ్లూ మరియు బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో ఈ ఫోన్ లభించవచ్చు. జులై ఆఖర్లో గ్లోబల్ మార్కెట్‌లో లాంచ్ అయ్యాక, భారత్‌లో Infinix Note 40X 5G విడుదలవుతుంది.

Infinix Note 40X 5G స్పెసిఫికేషన్స్ (లీక్)

డిస్ప్లే: Infinix Note 40X 5G లో 6.78-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.

చిప్సెట్: Infinix Note 40X 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ ఉంటుంది.

ర్యామ్, స్టోరేజీ: Infinix Note 40X 5G 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీతో లాంచ్ కానుంది.

కెమెరా: Infinix Note 40X 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 108ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి సెకండరీ, 2ఎంపి థర్డ్ లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

బ్యాటరీ: Infinix Note 40X 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

సాఫ్ట్‌వేర్: Infinix Note 40X 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఎక్స్ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

కనెక్టివిటీ: Infinix Note 40X 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ ఎల్టీఈ, డ్యూయల్ బ్యాండ్ వై-ఫై, బ్లూటూత్, ఎన్ఎఫ్‌సీ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉంటాయి.