Infinix Note 40S: రివీలైన ఇన్ఫినిక్స్ నోట్ 40ఎస్ స్పెసిఫికేషన్స్

Highlights

  • త్వరలో Infinix Note 40S లాంచ్
  • మీడియాటెక్ హీలియో జీ99 చిప్
  • 108 ఎంపి మెయిన్ కెమెరా

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ Infinix నుంచి త్వరలో నోట్ సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ కానుంది. Infinix Note 40S పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. తాజాగా ఈ ఫోన్ ఇన్ఫినిక్స్ మయన్మార్ అధికార వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది. దీంతో డివైజ్ యొక్క స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. Infinix Note 40S ఫోన్ 8జిబి ర్యామ్, 108ఎంపి కెమెరా, 120 హెర్ట్జ్ అమోలెడ్ స్క్రీన్ తో వస్తున్నట్లు లిస్టింగ్ ద్వారా తెలుస్తోంది. ఓసారి పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి.

Infinix Note 40S స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Infinix Note 40S లో 6.78-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ స్క్రీన్, 1080*2436 పిక్సెల్స్ రెజుల్యూషన్, 3డీ కర్వ్డ్ అమోలెడ్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1300 నిట్స్ బ్రైట్నెస్ ఉంటాయి.

ప్రాసెసర్: Infinix Note 40S లో మీడియాటెక్ హీలియో జీ99 అల్టిమేట్ చిప్సెట్ ఉంటుంది. ఇది 6 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.2 గిగాహెర్ట్జ్.

మెమొరీ: Infinix Note 40S డివైజ్ 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీతో వస్తోంది. ఈ ఫోన్ లో 8జిబి వర్చువల్ ర్యామ్ ను కూడా అందించనున్నారు. దీంతో యూజర్‌కి గరిష్టంగా 16జిబి ర్యామ్ పవర్ లభిస్తుంది.

కెమెరా: Infinix Note 40S లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 108ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది. ముందువైపు కూడా డ్యూయల్ ఎల్ఈడీ ఫ్లాష్ ఉంటుంది.

బ్యాటరీ: Infinix Note 40S లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 33 వాట్ వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్, 20 వాట్ వైర్లెస్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

కనెక్టివిటీ: Infinix Note 40S లో డ్యూయల్ సిమ్, 4జీ, బ్లూటూత్, వై-ఫై వంటి ఆప్షన్స్ ఉంటాయి.