Infinix Note 40 5G: మ్యాగ్‌చార్జ్ వైర్లెస్ చార్జింగ్‌తో భారత్‌లో లాంచైన ఇన్ఫినిక్స్ ఫోన్

Highlights

  • భారత్‌లో Infinix Note 40 5G లాంచ్
  • వైర్లెస్ చార్జింగ్ తో వచ్చిన డివైజ్
  • డివైజ్ సేల్ తేదీ జూన్ 26

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Infinix భారతీయ మార్కెట్ లో ఒక కొత్త ఫోన్ లాంచ్ చేసింది. Infinix Note 40 5G పేరుతో ఈ డివైజ్ లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ మ్యాగ్‌చార్జ్ వైర్లెస్ చార్జింగ్ సపోర్ట్ తో రావడం విశేషం. ఈ ఫోన్ లో 120 హెర్ట్జ్ అమోలెడ్ డిస్ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ ప్రాసెసర్, 108ఎంపి కెమెరా వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఓసారి ఈ ఫోన్ యొక్క ధర, లభ్యత మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం.

Infinix Note 40 5G ధర, లభ్యత

Infinix Note 40 5G స్మార్ట్‌ఫోన్ 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీతో లాంచ్ అయ్యింది. దీని ధర ఎంతో తెలుసుకుందాం. ఈ ఫోన్ ధరను రూ.19,999 గా నిర్ణయించారు. ఈ ఫోన్‌ని జూన్ 26వ తేదీన మధ్యాహ్నం 2 గంటల నుంచి ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.

Infinix Note 40 5G స్మార్ట్‌ఫోన్ ఒబ్సిడియన్ బ్లాక్ మరియు టైటాన్ గోల్డ్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Infinix Note 40 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Infinix Note 40 5G లో 6.78-ఇంచ్ అమోలెడ్ స్క్రీన్, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 10-బిట్ కలర్ డెప్త్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1300 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 2160 హెర్ట్జ్ పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్, సెంటర్ పంచ్ హోట్ కటౌట్ ఉన్నాయి.

ప్రాసెసర్: Infinix Note 40 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 7020 చిప్సెట్ వాడారు. గ్రాఫిక్స్ కోసం ఐఎంజీ బీఎక్స్ఎమ్-8-256 జీపీయూ ఉపయోగించారు.

మెమొరీ: Infinix Note 40 5G లో 8జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 8జిబి వర్చువల్ ర్యామ్, 256జిబి యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీ ఉన్నాయి.

సాఫ్ట్‌వేర్: Infinix Note 40 5G స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఎక్స్ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

కెమెరా: Infinix Note 40 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 108ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి సెకండరీ లెన్స్ ఉన్నాయి. సెల్పీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.

బ్యాటరీ: Infinix Note 40 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వచ్చింది.

కనెక్టివిటీ: Infinix Note 40 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, ఎన్ఎఫ్‌సీ, జపీఎస్ వంటి ఆప్షన్స్ ఉన్నాయి.