Honor: ఫిబ్రవరి 15న భారత్‌లో లాంచ్ కానున్న Honor X9b

Highlights

  • ఇప్పటికే గ్లోబల్ గా లాంచైన Honor X9b
  • ఫిబ్రవరి 15న భారత్ లో లాంచ్
  • డివైజ్ ధర రూ.30,000 లోపు ఉండే అవకాశం

చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ Honortech త్వరలో భారతీయ మార్కెట్ లో Honor X9b డివైజ్ ని లాంచ్ చేయనుంది. ఫిబ్రవరి 15న భారత్ లో Honor X9b లాంచ్ కానున్నట్లు కంపెనీ అధికారికంగా వెల్లడించింది. ఇప్పటికే Honor X9b గ్లోబల్ గా లాంచ్ అయ్యింది. దీంతో డివైజ్ కి సంబంధించిన సమాచారం అందుబాటులో ఉంది. సరే, ఓసారి Honor X9b స్మార్ట్‌ఫోన్ యొక్క ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి.

Honor X9b 5G ఇండియా లాంచ్ వివరాలు

హానర్‌టెక్ భారత్ లో ఫిబ్రవరి 15న ఒక పెద్ద ఈవెంట్ నిర్వహించబోతోంది. ఇదే ఈవెంట్ లో Honor X9b 5G డివైజ్ లాంచ్ కానుంది. మరో విషయం ఏంటంటే, భారతీయ సింగ్ బి ప్రాక్ ఈ ఈవెంట్ లో పాల్గొననున్నారు.

Honor X9b ధర

  • భారతీయ మార్కెట్ లో Honor X9b ధర రూ.25,000 నుంచి రూ.30,000 మధ్య ఉంటుందని సమాచారం.
  • Honor X9b డివైజ్ ని అన్ని ఆఫర్లతో కలుపుకుని రూ.23,000 కి కొనుగోలు చేసే వీలుంటుందని పలు కథనాల ద్వారా స్పష్టమవుతోంది.
  • Honor X9b తో పాటు ఫిబ్రవరి 15న Honor Choice ఇయర్ బడ్స్ కూడా లాంచ్ అవుతోంది.

Honor X9b స్పెసిఫికేషన్స్ (గ్లోబల్)

  • డిస్ప్లే: Honor X9b 5G లో 6.78-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ స్క్రీన్, 1200*2652 పిక్సెల్స్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1920 హెర్ట్జ్ పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్, 1200 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 429 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, ఎస్‌జీఎస్ గ్లాస్ ప్రొటెక్షన్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Honor X9b 5G లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 చిప్సెట్, అడ్రెనో 710 జీపీయూ ఉన్నాయి.
  • ర్యామ్, స్టోరేజీ: Honor X9b 5G డివైజ్ 8జిబి/12జిబి ర్యామ్, 256జిబి యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీ, 8జిబి వర్చువల్ ర్యామ్ సపోర్ట్ ని ఆఫర్ చేస్తుంది.
  • సాఫ్ట్‌వేర్: Honor X9b 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత మ్యాజిక్ఓఎస్ 7.2 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • కెమెరా: Honor X9b 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 108ఎంపి మెయిన్ కెమెరా, 5ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.
  • బ్యాటరీ: Honor X9b 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,800 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 35 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • కనెక్టివిటీ: Honor X9b 5G లో 5జీ, డ్యూయల్ సిమ్, వై-ఫై 5, బ్లూటూత్ 5.1, ఎన్ఎఫ్‌సీ, జీపీఎస్, యూఎస్బీ 2.0 వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి.
  • కలర్ ఆప్షన్స్: Honor X9b 5G డివైజ్ సన్‌రైజ్ ఆరెంజ్, మిడ్నైట్ బ్లాక్, ఎమరాల్డ్ గ్రీన్ మరియు టైటానియమ్ సిల్వర్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.