Honor X9b: లాంచ్‌కి ముందు లీకైన ఇండియా మార్కెట్ ధర, లాంచ్ తేదీ

Highlights

  • ఫిబ్రవరి 8 లేదా 9 తేదీల్లో Honor X9b లాంచ్ అయ్యే ఛాన్స్
  • స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 చిప్‌తో రానున్న Honor X9b
  • డివైజ్ ధర రూ.30 వేల లోపు ఉండే అవకాశం

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీదారు Honor త్వరలో భారతీయ మార్కెట్ లో Honor X9b అనే స్మార్ట్‌ఫోన్‌ని లాంచ్ చేయనుంది. తమ ఫోన్ ఎంత పటిష్టమైనదో తెలిపేందుకు పలు పరీక్షలు చేస్తున్న హానర్, ఆ వీడియోలను గత కొన్ని రోజులుగా టీజ్ చేస్తూ వస్తోంది. ఇకపోతే, Honor X9b డివైజ్ మిడ్-రేంజ్ బడ్జెట్ లో మార్కెట్ లోకి ప్రవేశించనుంది. తాజాగా Honor X9b యొక్క భారత మార్కెట్ ధర, లాంచ్ తేదీ, స్పెసిఫికేషన్స్ లీక్ అయ్యాయి. ఆ విశేషాలను తెలుసుకుందాం పదండి.

Honor X9b ఇండియా లాంచ్ తేదీ, ధర (లీక్)

  • ప్రముఖ టిప్‌స్టర్ పారస్ గుగ్లాని Honor X9b భారత మార్కెట్ ధర, లాంచ్ తేదీని లీక్ చేశారు.
  • Honor X9b డివైజ్ భారత్ లో ఫిబ్రవరి 8 లేదా 9 తేదీల్లో లాంచ్ అవుతుందని టిప్‌స్టర్ అంచనా వేశారు.
  • అయితే రానున్న రోజుల్లో Honor X9b డివైజ్ యొక్క అసలైన లాంచ్ తేదీ రివీల్ కానుంది.
  • Honor X9b స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత మ్యాజిక్ ఓఎస్ 7.2 కస్టమ్ స్కిన్, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 చిప్, 12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ వంటి స్పెసిఫికేషన్స్ తో వస్తుందని టిప్‌స్టర్ పారస్ తెలిపారు.

Honor X9b 5G స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Honor X9b 5G లో 6.78-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ స్క్రీన్, 1200*2652 పిక్సెల్స్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1920 హెర్ట్జ్ పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్, 1200 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 429 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, ఎస్‌జీఎస్ గ్లాస్ ప్రొటెక్షన్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Honor X9b 5G లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 చిప్సెట్, అడ్రెనో 710 జీపీయూ ఉన్నాయి.
  • ర్యామ్, స్టోరేజీ: Honor X9b 5G డివైజ్ 8జిబి/12జిబి ర్యామ్, 256జిబి యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీ, 8జిబి వర్చువల్ ర్యామ్ సపోర్ట్ ని ఆఫర్ చేస్తుంది.
  • సాఫ్ట్‌వేర్: Honor X9b 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత మ్యాజిక్ఓఎస్ 7.2 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • కెమెరా: Honor X9b 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 108ఎంపి మెయిన్ కెమెరా, 5ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.
  • బ్యాటరీ: Honor X9b 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,800 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 35 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • కనెక్టివిటీ: Honor X9b 5G లో 5జీ, డ్యూయల్ సిమ్, వై-ఫై 5, బ్లూటూత్ 5.1, ఎన్ఎఫ్‌సీ, జీపీఎస్, యూఎస్బీ 2.0 వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి.
  • కలర్ ఆప్షన్స్: Honor X9b 5G డివైజ్ సన్‌రైజ్ ఆరెంజ్, మిడ్నైట్ బ్లాక్, ఎమరాల్డ్ గ్రీన్ మరియు టైటానియమ్ సిల్వర్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.