180MP కెమెరా, 5,600mAh బ్యాటరీతో లాంచైన Honor Magic 6 Pro

Highlights

  • చైనాలో లాంచైన Honor Magic 6 Pro
  • Magic 6 సిరీస్‌లో వచ్చిన 3 మోడల్స్
  • 180ఎంపి కెమెరాతో లాంచైన Magic 6 Pro

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Honor చైనాలో Honor Magic 6 సిరీస్ లాంచ్ చేసింది. ఈ సిరీస్ లో Honor Magic 6, Honor Magic 6 Pro మరియు Honor Magic 6 Lite డివైజెస్ లాంచ్ అయ్యాయి. ఈ ఆర్టికల్ లో మనం Honor Magic 6 Pro గురించి తెలుసుకుందాం. ఈ ఫోన్ 180ఎంపి మెయిన్ కెమెరాతో రావడం విశేషం. ఇంకా ఎన్నో ఆకట్టుకునే ఫీచర్లు ఈ ఫోన్లో ఉన్నాయి. ఓసారి ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

Honor Magic 6 Pro ధర, కలర్, లభ్యత

  • Honor Magic 6 Pro డివైజ్ లేక్ బ్లూ, క్లౌడ్ పర్పుల్, కిల్లియన్ స్నో, బార్లీ గ్రీన్ మరియు వెల్వెట్ బ్లాక్ కలర్స్ ఆప్షన్స్ లో లభిస్తుంది.
  • Honor Magic 6 Pro 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ ఆప్షన్ ధర 5,699 యువాన్లు (సుమారు రూ.67,000) గా ఉంది.
  • Honor Magic 6 Pro 16జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ ఆప్షన్ ధర 6,199 యువాన్లు (సుమారు రూ.73,000) గా ఉంది.
  • Honor Magic 6 Pro 16జిబి ర్యామ్ మరియు 1టిబి స్టోరేజీ వేరియంట్ ధర 6699 యువాన్లు (సుమారు రూ.79,000) గా ఉంది.

Honor Magic 6 Pro స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Honor Magic 6 Pro లో 6.8-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ కర్వ్డ్ అమోలెడ్ ఎల్టీపీవో స్క్రీన్, 2800*1280 పిక్సెల్స్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ (1-120హెర్ట్జ్ 8టీ ఎల్టీపీవో), డాల్బీ విజన్, జెయింట్ రైనోసారస్ గ్లాస్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Honor Magic 6 Pro లో స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్ వాడారు.
  • ఓఎస్: Honor Magic 6 Pro డివైజ్ హానర్ మ్యాజిక్ ఓఎస్ 8.0 పై పని చేస్తుంది. ఇది ఏఐ ఎబిలిటీతో వస్తోంది.
  • ర్యామ్, స్టోరేజీ: Honor Magic 6 Pro డివైజ్ 12జిబి/16జిబి ర్యామ్, 256జిబి/512జిబి/1టిబి స్టోరేజీ వేరియంట్స్ లో లభిస్తుంది.
  • కెమెరా: Honor Magic 6 Pro లో 50ఎంపి అల్ట్రా-డైనమిక్ మెయిన్ కెమెరా, 50ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 180ఎంపి పెరిస్కోప్ అల్ట్రా-టెలీఫోటో 2.5x ఆప్టికల్ జూమ్ ఓఐఎస్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 50ఎంపి + టీఓఎఫ్ సెన్సర్ ని అందించారు.
  • బ్యాటరీ: Honor Magic 6 Pro లో పవర్ బ్యాకప్ కోసం 5,600 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.