Honor 200 5G: అమెజాన్‌లో హానర్ 200 5జీ టీజర్ విడుదల, పూర్తి వివరాలు తెలుసుకోండి

Highlights

  • త్వరలో Honor 200 5G సిరీస్ లాంచ్
  • ఇప్పటికే గ్లోబల్‌గా లాంచైన హానర్ 200 సిరీస్
  • 1.5కే కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Honor త్వరలో భారతీయ మార్కెట్ లో Honor 200 5G సిరీస్ ను లాంచ్ చేయనుంది. ఇప్పటికే ఈ సిరీస్ చైనాతో పాటు గ్లోబల్ మార్కెట్స్ లో లాంచ్ అయ్యింది. తాజాగా Honor 200 5G సిరీస్ యొక్క మైక్రో-సైట్ ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్ఫమ్ అమెజాన్ పై ప్రత్యక్షమైంది. దీంతో ఇండియా లాంచ్ ఖరారైంది. కానీ, ఇంకా లాంచ్ తేదీ వెల్లడి కాలేదు. అయితే ఈ నెలలోనే లాంచ్ ఉంటుందని భావిస్తున్నారు. పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి.

Honor 200 5G సిరీస్ అమెజాన్ టీజర్

Honor 200 5G సిరీస్ యొక్క మైక్రో-సైట్ అమెజాన్ పై ప్రత్యక్షమైంది. దీని ద్వారా సినీమాటిక్ ఫోటోగ్రఫీ, కర్వ్డ్ డిస్ప్లే వంటి స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి.

హానర్ ఫోన్ల నుంచి యూజర్లు ఎదుర్కొంటోన్న సమస్యలపై నిర్వహించిన సర్వేను కూడా లిస్టింగ్ లో చూపించారు. దీంతో, హానర్ తన కొత్త స్మార్ట్‌ఫోన్లను మెరుగుపరిచేందుకు ఓఎస్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు అందించే అవకాశం ఉంది.

Honor 200 5G సిరీస్ యొక్క లాంచ్ తేదీ ఇంకా వెల్లడి కావాల్సి ఉంది. ఈ నెలలోనే మొదటి లేదా రెండో వారంలో హానర్ 200 సిరీస్ లాంచ్ అవుతుందని అంచనా వేస్తున్నారు.

Honor 200, 200 Pro స్పెసిఫికేషన్స్ (గ్లోబల్)

డిస్ప్లే: HONOR 200 లో 2664*1200 పిక్సెల్స్ రెజుల్యూషన్ గల 6.7-ఇంచ్ స్క్రీన్ ఉంటుంది. మరోవైపు HONOR 200 Pro లో 2700*1224 పిక్సెల్స్ రెజుల్యూషన్ గల 6.78-ఇంచ్ డిస్ప్లే ఉంటుంది. ఇక ఈ రెండు ఫోన్లలో 1.5కే ఓఎల్ఈడీ కర్వ్డ్ స్క్రీన్స్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 4000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి.

ప్రాసెసర్: HONOR 200 లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్ ఉంటుంది. 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైన ఈ ప్రాసెసర్ హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.63 గిగాహెర్ట్జ్. ఈ ఫోన్ లో గ్రాఫిక్స్ కోసం అడ్రెనో 720 జీపీయూ ఇచ్చారు. HONOR 200 Pro లో స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 3 చిప్సెట్ వాడారు. గ్రాఫిక్స్ కోసం అడ్రెనో 735 జీపీయూ అందించారు.

సాఫ్ట్‌వేర్: HONOR 200 సిరీస్ లోని రెండు ఫోన్లు ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత మ్యాజిక్ఓఎస్ 8.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తాయి.

రియర్ కెమెరా: HONOR 200 సిరీస్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ తో వచ్చింది. HONOR 200 లో 50ఎంపి సోని ఐఎంఎక్స్906 మెయిన్ కెమెరా, 12ఎంపి అల్ట్రావైడ్/మ్యాక్రో సెన్సర్, 50ఎంపి 2.5ఎక్స్ పొట్రెయిట్ టెలీఫోటో లెన్స్ ఉన్నాయి. HONOR 200 Pro లో 50ఎంపి ఒమ్నివిజన్ ఒవి50హెచ్ ప్రైమరీ కెమెరా, 12ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 50ఎంపి 2.5ఎక్స్ పొట్రెయిట్ టెలీఫోటో లెన్స్ ఉన్నాయి.

ఫ్రంట్ కెమెరా: HONOR 200, HONOR 200 Pro ఫోన్లలో 50ఎంపి సోని ఐఎంఎక్స్906 కెమెరా ఉంది. దీని అపర్చర్ F/2.1. అయితే HONOR 200 Pro లో 3డీ డెప్త్ సెన్సర్ కూడా ఉంది. దీంతో ప్రో వేరియంట్ లో డ్యూయల్ సెల్ఫీ కెమెరా సెటప్ ఉందని చెప్పవచ్చు.

బ్యాటరీ: HONOR 200 సిరీస్ లోని రెండు ఫోన్లలో పవర్ బ్యాకప్ కోసం 5,200 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఈ ఫోన్లు 100 వాట్ సూపర్‌చార్జ్ ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీతో వచ్చాయి. ప్రో వేరియంట్ 66 వాట్ వైర్లెస్ సూపర్‌చార్జ్ టెక్నాలజీకి సపోర్ట్ చేస్తుంది.