HMD: ‘మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2024’ ఈవెంట్‌లో ప్రదర్శితమైన హెచ్ఎండీ ఫోన్లు

Highlights

  • త్వరలో లాంచ్ కానున్న హెచ్ఎండీ ఫోన్లు
  • నేడు ప్రదర్శితమైన డివైజెస్
  • రివీలైన డిజైన్, ఫోటోస్

HMD బ్రాండ్ మొబైల్ ఫోన్లు త్వరలో రానున్నాయని సదరు సంస్థ కొన్ని రోజుల క్రితం అధికార ప్రకటన చేసింది. ఆ రోజు నుంచి వినియోగదారులు, టెక్నాలజీ ఔత్సాహికులు ఈ ఫోన్ల లాంచ్ కోసం ఎదురు చూస్తున్నారు. తాజాగా బార్సిలోనాలో జరుగుతోన్న మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2024 లో హెచ్ఎండీ సంస్థ తాను లాంచ్ చేయబోయే ఫోన్లను ప్రదర్శించింది. సరే, ఓసారి హెచ్ఎండీ ఫోన్ల యొక్క ఫోటోలు, డిజైన్ గురించి తెలుసుకుందాం పదండి.

HMD ఫోన్లు ఎప్పుడు లాంచ్ అవుతాయి?

  • HMD Global కొన్ని రోజుల క్రితం ఒక ముఖ్యమైన ప్రకటన చేసింది. తాము రాబోయే రోజుల్లో నోకియా బ్రాండ్ తో పాటు, హెచ్ఎండీ బ్రాండ్ ఫోన్లను లాంచ్ చేయనున్నట్లు తెలిపింది.
  • తాజాగా మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2024 లో తన కొత్త మొబైల్ ఫోన్లను ప్రదర్శించింది.
  • HMD Global తన ఫోన్ల లాంచ్ తేదీని వెల్లడించలేదు. అయితే 2024 వేసవి కాలంలో లాంచ్ అవుతాయని ఎండబ్ల్యూసీ 2024 ఈవెంట్ లో హెచ్ఎండీ కంపెనీ తెలిపింది.
  • త్వరలోనే HMD Global సంస్థ తన కొత్త ఫోన్ల లాంచ్ తేదీని ప్రకటించే అవకాశం ఉంది.
  • యూజర్ ఇంటివద్దే రిపేరు చేసుకునే విధంగా ఉండే ఫోన్లను తాము తీసుకురాబోతున్నట్లు HMD Global తెలిపింది.
  • అంటే యూజర్ తన డివైజ్ ని సొంతంగా రిపేరు చేసుకోవడంతో పాటు మొబైల్ భాగాలను కూడా మార్చే అవకాశం ఉంటుందన్నమాట.
  • హెచ్ఎండీ ఫోన్ తో పాటు యూజర్ కి ఒక రిపేర్ కిట్ కూడా అందించబడుతుందని సమాచారం.

సరసమైన ధరలకే లభించనున్న HMD ఫోన్లు

  • HMD స్మార్ట్‌ఫోన్లు మిడ్-బడ్జెట్ సెగ్మెంట్ లో లాంచ్ అవుతాయని సమాచారం.
  • అన్ని వర్గాల యూజర్లను దృష్టిలో పెట్టుకుని ఈ ఫోన్లను తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది.
  • HMD Global తీసుకొచ్చే కొత్త స్మార్ట్‌ఫోన్ల ధర రూ.12,000 నుంచి రూ.18,000 లేదా రూ.20,000 మధ్య ఉంటుందని అంచనా వేస్తున్నారు.
  • అయితే, త్వరలో HMD Global తన కొత్త డివైజెస్ పేర్లు, లాంచ్ తేదీ, ధర శ్రేణి వంటి వివరాలను ప్రకటించే అవకాశం ఉంది.