HMD 105, HMD 110 ఫీచర్ ఫోన్లు భారత్‌లో విడుదల, ధర, స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి

Highlights

  • HMD 105, HMD 110 లాంచ్
  • యూపీఐ సపోర్ట్ తో వచ్చిన ఫోన్లు
  • నేటి నుంచి మొదలైన సేల్

నోకియా పేరెంట్ కంపెనీ HMD నేడు భారతీయ మార్కెట్ లో రెండు ఫీచర్ ఫోన్లు లాంచ్ చేసింది. HMD 105, HMD 110 అనే పేర్లతో ఈ ఫోన్లు లాంచ్ అయ్యాయి. ఈ ఫీచర్ ఫోన్లు ఎంపీ 3 ప్లేయర్, వైర్లెస్ ఎఫ్ఎమ్ రేడియో, ఆటో కాల్ రికార్డింగ్, యూపీఐ వంటి ఫీచర్లతో వచ్చాయి. ఓసారి ఈ ఫోన్ల ధర, లభ్యత మరియు పూర్తి ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

HMD 105, HMD 110 ధర, లభ్యత

భారత్ లో HMD 105 ధరను రూ.999 గా నిర్ణయించారు. నేటి నుంచి విక్రయాలు మొదలయ్యాయి. ఈ ఫోన్ బ్లాక్, పర్పుల్ మరియు బ్లూ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. మరోవైపు, HMD 110 డివైజ్ ధరను రూ.1,199 గా నిర్ణయించారు. ఈ ఫోన్ బ్లాక్ మరియు గ్రీన్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

HMD 105, HMD 110 డివైజెస్ రిటైల్ స్టోర్స్, ఈ-కామర్స్ సైట్స్, హెచ్ఎండి.కామ్ వెబ్‌సైట్ ద్వారా కొనుగోలుకి అందుబాటులో ఉంటాయి.

HMD 105, HMD 110 స్పెసిఫికేషన్స్, ఫీచర్స్

HMD 105, HMD 110 డివైజెస్ కర్వ్డ్ ఫ్రేమ్ డిజైన్ కలిగి ఉన్నాయి. దీని వల్లన గ్రిప్, స్ట్రెంగ్త్ బాగుంటాయి. రెక్టాంగ్యులర్ స్క్రీన్, టీ9 కీప్యాడ్ ఈ ఫోన్లలో ఉన్నాయి.

HMD 105, HMD 110 డివైజెస్ లో ఎంపీ3 ప్లేయర్ మరియు ఎఫ్ఎమ్ రేడియో ఫీచర్లు ఉన్నాయి.

ఇంకా ఈ ఫోన్లలో ఇన్-బిల్ట్ యూపీఐ యాప్ ఉంది. ఈ రెండు ఫోన్ల ద్వారా ఆన్‌లైన్ పేమెంట్స్, డిజిటల్ ట్రాన్సాక్షన్స్‌ను ఇంటర్నెట్ లేకుండా చేయవచ్చు.

HMD 110 లో మాత్రమే కెమెరా ఉంది. రియర్ ప్యానెల్ పై సింగిల్ కెమెరాను అందించారు. దీనికి తోడు ఒక ఫ్లాష్ లైట్ కూడా ఉంది.

HMD 105, HMD 110 ఫోన్లలో పవర్ బ్యాకప్ కోసం 1000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఒక్కసారి పూర్తిగా చార్జ్ చేస్తే 18 రోజుల పాటు నడుస్తాయని కంపెనీ చెబుతోంది.

ఈ రెండు ఫీచర్ ఫోన్లలో ఫోటో టాకర్, ఆటో కాల్ రికార్డింగ్ ఫీచర్లు ఉన్నాయి. ఇంకా డ్యూయల్ ఎల్ఈడీ ఫ్లాష్ కూడా ఉంది.

HMD 105, HMD 110 కీప్యాడ్ ఫోన్లలో 9 ప్రాంతీయ భాషల సపోర్ట్ ను కంపెనీ అందిస్తోంది. ఈ రెండు ఫీచర్ ఫోన్లు మొత్తం 23 భాషల ఇన్‌పుట్‌ను స్వీకరించగలవు.