Google: లీకైన Pixel 8a స్పెసిఫికేషన్స్

Highlights

  • మరోసారి లీకైన Google Pixel 8a స్పెసిఫికేషన్స్
  • మే 14న గూగుల్ ఐ/ఓ ఈవెంట్‌లో లాంచ్
  • 6.1-ఇంచ్ డిస్ప్లేతో వస్తోన్న డివైజ్

ప్రముఖ టెక్ కంపెనీ Google నుంచి త్వరలో కొత్త పిక్సెల్ ఫోన్ లాంచ్ కానుంది. Google Pixel 8a పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి వస్తోంది. ఇటీవలె ఈ ఫోన్ కి సంబంధించి కొన్ని వివరాలు లీక్ అయ్యాయి. తాజాగా ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ మరోసారి లీక్ అయ్యాయి.

అలాగే కొన్ని రోజుల క్రితం పిక్సెల్ 8ఏ బ్లూటూత్ ఎస్ఐజీ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది. ఇప్పుడు టిప్‌స్టర్ ద్వారా పిక్సెల్ 8ఏ యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్ మరియు లాంచ్ టైమ్ లైన్ రివీల్ అయ్యాయి. ఓసారి ఆ విశేషాలు తెలుసుకుందాం పదండి.

Google Pixel 8a స్పెసిఫికేషన్స్ (లీక్)

Google Pixel 8a లో 6.1-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ ఓఎల్ఈడీ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయని టిప్‌స్టర్ యోగేశ్ బ్రార్ ద్వారా తెలుస్తోంది.

ఈ స్మార్ట్‌ఫోన్ లో టెన్సర్ జీ3 చిప్సెట్ వాడే అవకాశం ఉంది. ఇదే చిప్సెట్‌ని పిక్సెల్ 8 సిరీస్ లో వాడారు.

Google Pixel 8a డివైజ్ 128జిబి/256 స్టోరేజీ వేరియంట్స్, ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో లాంచ్ అవుతుందని సమాచారం.

Google Pixel 8a డివైజ్ 64ఎంపి ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 13ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 13ఎంపి ఫ్రంట్ కెమెరాతో వచ్చే అవకాశం ఉంది.

Google Pixel 8a స్మార్ట్‌ఫోన్ 4,500 ఎంఏహెచ్ బ్యాటరీ, 27 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోందని లీక్స్ ద్వారా తెలుస్తోంది.

Google Pixel 8a లాంచ్ టైమ్‌లైన్, ధర

Google Pixel 8a మే నెలలో లాంచ్ అవుతుందని టిప్‌స్టర్ ద్వారా తెలుస్తోంది. గూగుల్ ఐ/ఓ 2024 ఈవెంట్ లో ఈ ఫోన్ లాంచ్ అవుతుంది. మే 14వ తేదీన ఈవెంట్ జరుగుతుంది. గూగుల్ పిక్సెల్ 8ఏ ధర 500 డాలర్ల నుంచి 550 డాలర్ల మధ్య ఉంటుందని అంచనా వేస్తున్నారు. దీన్ని భారతీయ కరెన్సీలో సుమారు రూ.41,635 అని చెప్పవచ్చు. మార్కెట్‌ని బట్టి ధరలో తేడా ఉంటుంది.