CMF Phone 1: లీకైన సీఎంఎఫ్ ఫోన్ 1 స్పెసిఫికేషన్స్, భారత మార్కెట్ ధర

Highlights

  • త్వరలో CMF Phone 1 లాంచ్
  • కన్ఫర్మ్ అయిన స్పెసిఫికేషన్స్
  • సూపర్ అమోలెడ్ డిస్ప్లేతో వస్తోన్న ఫోన్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ మేకర్ Nothing సబ్-బ్రాండ్ CMF నుంచి త్వరలో మొదటి ఫోన్ లాంచ్ అవ్వబోతోంది. CMF Phone 1 పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. తాజాగా ఈ ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్‌ మరియు భారత మార్కెట్ ధర వివరాలు టిప్‌స్టర్ యోగేశ్ బ్రార్ ద్వారా లీక్ అయ్యాయి. ఓసారి ఆ విశేషాలను తెలుసుకుందాం.

CMF Phone 1 స్పెసిఫికేషన్స్ (లీక్)

డిస్ప్లే: CMF Phone 1 లో 6.7-ఇంచ్ సూపర్ అమోలెడ్ ఎల్టీపీఎస్ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2000 నిట్స్ పీక్ బ్రైట్నెస్, ఫుల్‌హెచ్డీ+ రెజుల్యూషన్, ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉంటాయి.

ప్రాసెసర్: CMF Phone 1 లో మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్సెట్ ఉంటుంది.

మెమొరీ: CMF Phone 1 డివైజ్ 6జిబి/8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో 2టిబి వరకు స్టోరేజీని పెంచుకునే వీలుంటుంది.

కెమెరా: CMF Phone 1 లో 50ఎంపి సోని మెయిన్ సెన్సర్, సెకండరీ డెప్త్ సెన్సర్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది. 4కే వీటియో రికార్డింగ్, ఏఐ వివిడ్ మోడ్, ఈఐఎస్ సపోర్ట్ ఈ ఫోన్ లో ఉంటాయి.

ఓఎస్: CMF Phone 1 డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో లాంచ్ కానుంది. 2 ఏళ్ళు ఓఎస్ అప్డేట్స్, 3 ఏళ్ళు సెక్యూరిటీ అప్డేట్స్ ఈ ఫోన్ కి లభిస్తాయి.

బ్యాటరీ: CMF Phone 1 లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్‌ సపోర్ట్ తో వస్తోంది.

కనెక్టివిటీ: CMF Phone 1 లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై వంటి ఆప్షన్స్ ఉంటాయి.

ఇతర ఫీచర్లు: CMF Phone 1 లో ఐపీ52 రేటింగ్, మోనో స్పీకర్ వంటి ఫీచర్లు ఉంటాయి.

CMF Phone 1 ధర, కలర్ ఆప్షన్స్ (లీక్)

CMF Phone 1 స్మార్ట్‌ఫోన్ రెండు స్టోరేజీ ఆప్షన్స్ లో లాంచ్ అవుతుందని లీక్ ద్వారా తెలుస్తోంది. వీటి ధరలు ఎలా ఉండనున్నాయో చూద్దాం.

CMF Phone 1 యొక్క 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.15,999 గా ఉంటుంది. 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.17,999 గా ఉంటుందని లీక్ ద్వారా తెలుస్తోంది.

ఈ ఫోన్ ధర రూ.12 వేల నుంచి రూ.15 వేల మధ్య ఉంటుందని గత నివేదికల ద్వారా తెలిసింది. కానీ, ఇప్పుడు కాదని అర్థమవుతోంది.

ఇక కలర్ ఆప్షన్స్ విషయానికి వస్తే, ఈ ఫోన్ ఆరెంజ్, వైట్ మరియు బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.