CMF Phone 1: భారత్‌లో జులై 8 న లాంచ్ కానున్న సీఎంఎఫ్ ఫోన్ 1

Highlights

  • జులై 8న భారత్ లో CMF Phone 1 లాంచ్
  • మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్సెట్
  • అదే రోజున వాచ్ ప్రో 2, బడ్స్ ప్రో 2 విడుదల

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ మేకర్ Nothing యొక్క సబ్-బ్రాండ్ CMF నుంచి త్వరలో CMF Phone 1 భారత్ లో లాంచ్ కానుంది. తాజాగా ఈ ఫోన్ యొక్క లాంచ్ తేదీ ఖరారైంది. జులై 8వ తేదీన సీఎంఎఫ్ ఫోన్ 1 ఇండియాలో లాంచ్ కానుందని కంపెనీ అధికారిక ప్రకటన చేసింది. ఈ ఫోన్ ఆసక్తికరమైన ఫీచర్లు మరియు యూనిక్ లుక్ తో వస్తోంది. ఓసారి CMF Phone 1 యొక్క లాంచ్ వివరాలు మరియు అంచనా స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం.

CMF Phone 1 లాంచ్ తేదీ

CMF Phone 1 స్మార్ట్‌ఫోన్ యొక్క టీజర్ ను సోషల్ మీడియా ప్లాట్ఫామ్ X పై మరియు ఈ-కామర్స్ వేదిక ఫ్లిప్‌కార్ట్ పై సీఎంఎఫ్ బ్రాండ్ షేర్ చేసింది.

CMF Phone 1 తో పాటు వాచ్ ప్రో 2 మరియు బడ్జ్ ప్రో 2 లను కూడా లాంచ్ చేయనున్నట్లు సీఎంఎఫ్ తెలిపింది.

జులై 8వ తేదీన మధ్యాహ్నం 2.30 గంటలకు భారత్ లో CMF Phone 1 లాంచ్ అవుతుంది.

టీజర్ వీడియో ద్వారా డివైజ్ యొక్క వివరాలను బ్రాండ్ రివీల్ చేయలేదు. అయితే ఈ ఫోన్ ఆరెంజ్ మరియు బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుందని కంపెనీ తెలిపింది.

రానున్న రోజుల్లో డివైజ్ కి సంబంధించిన మరింత సమాచారం రివీల్ అవుతుందని కంపెనీ తెలిపింది.

CMF Phone 1 ధర (లీక్)

లీక్ ప్రకారం, CMF Phone 1 స్మార్ట్‌ఫోన్ యొక్క 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.19,999 గా ఉంటుందని సమాచారం. ఇది బాక్స్ ధర అయ్యే అవకాశం ఉంది. అయితే, ఆఫర్ లో భాగంగా ఈ ఫోన్ రూ.17,000 కి లభిస్తుందని తెలుస్తోంది. అసలు ధర లాంచ్ సమయంలో రివీల్ కానుంది.

CMF Phone 1 స్పెసిఫికేషన్స్ (అంచనా)

డిస్ప్లే: CMF Phone 1 లో 6.67-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ స్క్రీన్, ఓఎల్ఈడీ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.

ప్రాసెసర్: CMF Phone 1 లో మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్సెట్ వాడారు. ఇది 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైన ఆక్టాకోర్ ప్రాసెసర్.

మెమొరీ: CMF Phone 1 రెండు స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. అవి: 6జిబి ర్యామ్ + 128జిబి/256జిబి స్టోరేజీ.

కెమెరా: CMF Phone 1 లో 50ఎంపి ప్రైమరీ కెమెరా ఉంటుంది. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

బ్యాటరీ: CMF Phone 1 లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోంది.

ఓఎస్: CMF Phone 1 స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత నథింగ్ ఓఎస్ 2.6 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

కనెక్టివిటీ: CMF Phone 1 లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై వంటి ఆప్షన్స్ ఉంటాయి.