మీ ఫోన్ పెర్ఫామెన్స్ తగ్గిందా? అయితే ఈ బెస్ట్ ఆండ్రాయిడ్ క్లీనర్ యాప్స్ ట్రై చేయండి!

Highlights

  • మొబైల్ ఫోన్ పనితీరు నెమ్మదించడం సహజం
  • ఫోన్ లో ఉండే అనవసరమైన చెత్తే ఈ సమస్యకు కారణం
  • ఫోన్ ని క్లీన్ చేసి పెర్ఫామెన్స్ ని పెంచే ఆండ్రాయిడ్ క్లీనర్ యాప్స్ మీకోసం

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు కొన్ని రోజులు హ్యాండ్సెట్ వాడిన తర్వాత ఫోన్ స్లో అవుతుందని ఫిర్యాదు చేస్తున్నారు. మనం ఫోన్‌లో బ్రౌజర్ లేదా ఏదైనా యాప్‌లను ఉపయోగించినప్పుడు, అనేక సపోర్టింగ్ ఫైల్‌లు ఫోన్‌లో సేవ్ చేయబడతాయి. మన ఫోన్ పనితీరును మందగించేలా చేసే వీటిని జంక్ ఫైల్స్ అంటారు. కాబట్టి, మనం ఈ జంక్ ఫైల్స్ ని ఎప్పటికప్పుడు ఫోన్ నుండి తొలగిస్తూ ఉండాలి. ఇందుకోసం ఆండ్రాయిడ్ క్లీనర్ యాప్‌లు ఉపయోగపడతాయి. ఫోన్ పనితీరు మందగించడం వల్ల మీరు కూడా ఇబ్బంది పడుతుంటే, మేము మీకు ఉత్తమమైన ఆండ్రాయిడ్ క్లీనింగ్ యాప్‌ల వివరాలను అందిస్తున్నాం. ఓసారి కన్నేయండి.

ఉత్తమమైన ఆండ్రాయిడ్ క్లీనర్ యాప్స్

  • sd maid
  • Files by Google
  • CCleaner
  • One Booster
  • AVG Cleaner

sd maid (ఎస్‌డీ మెయిడ్)

  • డీప్ ఫైల్ క్లీనింగ్
  • ఫోన్ పెర్ఫామెన్స్ ఆప్టిమైజేషన్
  • ఫైల్ మేనేజర్

ఉత్తమ Android క్లీనర్ యాప్‌ల జాబితాలో మొదటి పేరు SD Maid. ఇది స్మార్ట్‌ఫోన్ ఆప్టిమైజేషన్ కోసం ఎక్కువగా ఉపయోగించే యాప్. ఈ యాప్ Android స్మార్ట్‌ఫోన్ నుండి జంక్ ఫైల్స్, డూప్లికేట్ ఫైల్స్ మరియు అన్‌ఇన్‌స్టాల్ చేసిన యాప్‌ల ఫైల్‌లను తొలగిస్తుంది. దీనితో పాటు, మీరు యాప్ నుండి డివైజ్ యొక్క స్టోరేజ్ ఓవర్‌వ్యూ (ఫైల్ మేనేజర్)ని కూడా తనిఖీ చేయవచ్చు. ఇది మాత్రమే కాదు, వినియోగదారులు ఈ యాప్‌లో క్లీనింగ్ ప్రక్రియను కూడా షెడ్యూల్ చేయవచ్చు.

Files by Google

  • ఫైల్ ట్రాన్స్‌ఫర్ ఫీచర్
  • ఫైల్ మేనేజర్

ఎంతో నమ్మదగిన, ఆధారపడదగిన ఆండ్రాయిడ్ క్లీనర్ యాప్స్ తో గూగుల్ యొక్క Files యాప్ కూడా ఒకటి. ఈ యాప్ ద్వారా, యూజర్లు జంక్ ఫైల్స్ ని డిలీట్ చేయవచ్చు. ఈ యాప్ యూజర్ కి అవసరంలేని యాప్స్, డూప్లికేట్ ఫైల్స్, ఫోటోస్ ని డిలీట్ చేయమని సలహాలు ఇస్తుంది. దీంతో పాటు, ఈ యాప్ ని మీరు ఫైల్ మేనేజర్ గా కూడా ఉపయోగించవచ్చు. అంతే కాదు, మీరు ఫైల్స్ ని కూడా ట్రాన్స్‌ఫర్ చేయవచ్చు.

CCleaner

  • మల్టీపుల్ యాప్ డిలీట్
  • స్ట్రాంగ్ అనలైజర్

ఆండ్రాయిడ్ క్లీనింగ్ యాప్స్ లో CCleaner ఎంతో ఆదరణ పొందింది. ఇది కేవలం ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లలో మాత్రమే కాదు, మ్యాక్ఓఎస్, విండోస్ 10 లలో కూడా అందుబాటులో ఉంది. ర్యామ్ ని క్లీన్ చేయడంతో పాటు, ఫోన్ నుంచి జంక్ ఫైల్స్ ని ఈ యాప్ తొలగిస్తుంది. ఇంకా వివిధ రకాల అప్లికేషన్స్ ని ఒకేసారి ఈ యాప్ ద్వారా డిలీట్ చేయవచ్చు. ఈ యాప్ లో స్టోరేజీ అనలైజర్ ఫీచర్ ఉంటుంది.

One Booster

  • క్లీనర్ మరియు యాంటీవైరస్ సపోర్ట్
  • సీపీయూ కూలర్
  • బ్యాటరీ సేవర్ ఫీచర్

ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ యూజర్లకు One Booster యాప్ కూడా ఉత్తమమైన ఆప్షన్. ఈ యాప్ ని క్లీనర్ గా మరియు యాంటీవైరస్ ప్రొటెక్షన్ గా వాడుకోవచ్చు. అందువల్ల మీరు ప్రత్యేకంగా మరొక యాంటీవైరస్ యాప్ ని ఇన్‌స్టాల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ యాప్ ద్వారా యూజర్లు జంక్ ఫైల్స్ ని క్లీన్ చేసుకోవచ్చు. ర్యామ్ క్లియర్, సీపీయూ కూలర్ వంటి ఫీచర్లను ఈ యాప్ లో పొందవచ్చు. ఈ యాప్ లో బ్యాటరీ సేవర్ ఫీచర్ కూడా ఉంది. అయితే ఈ యాప్ యాడ్ సపోర్ట్ తో వస్తోంది. ఇది కాస్త చిరాకు పెట్టే విషయమే.

AVG Cleaner

  • ఫైల్ మేనేజర్
  • మెమొరీ బూస్టర్
  • బ్యాగ్రౌండ్ యాప్ రిమూవ్

AVG Cleaner యాప్ కూడా ఉత్తమమైన ఆండ్రాయిడ్ క్లీనర్ యాప్స్ లో ఒకటి. ఈ యాప్ ని జంక్ క్లీనర్ గా మరియు ఫైల్ మేనేజర్ గా, మెమొరీ బూస్టర్ గా, ఇంటెలిజెంట్ ఫోటో అనలైజర్ గా ఉపయోగించుకోవచ్చు. దీంతో పాటు బ్యాడ్ క్వాలిటీ మరియు డూప్లికేట్ ఫోటోలను తొలగించేందుకు ఈ యాప్ లో ఆప్షన్ ఉంది. ఈ యాప్ లో బ్యాగ్రౌండ్ యాప్స్ ని తొలగించే ఆప్షన్ కూడా ఉంది. దీని వల్లన ఫోన్ పెర్ఫామెన్స్ మెరుగుపడుతుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.