Airtel: Jio బాటలో ఎయిర్టెల్, ప్లాన్స్ ధరలు పెంపు

టెలీకామ్ దిగ్గజం రిలయన్స్ JIO ఇటీవలె రీచార్జ్ ప్లాన్ల ధరల పెంపును ప్రకటించింది. ఆ వెనువెంటనే, మరొక దిగ్గజ టెలీకామ్ సంస్థ AIRTEL కూడా ధరల పెంపును అనౌన్స్ చేసింది. ఇకనుంచి ఈ రెండు బడా టెలీకామ్ కంపెనీల రీచార్జ్ ప్లాన్ల ధరలు భయపెట్టబోతున్నాయి. జులై 3 నుంచి పెరిగిన ఎయిర్టెల్ ప్లాన్ల ధరలు అమలులోకి వస్తాయి. ఎయిర్టెల్ తన ప్లాన్స్ ధరలను 10 నుంచి 20 శాతం మేర పెంచింది. అయితే ప్లాన్స్ ద్వారా లభించే ప్రయోజనాల్లో మాత్రం ఏ మార్పు ఉండదు.

Airtel ప్రీపెయిడ్ ప్లాన్ల యొక్క కొత్త మరియు పాత ధరలు

Jio-Airtel తర్వాత, వీఐ కూడా రేట్లు పెంచనుందా?

టెలీకామ్ రంగ నిపుణుల ప్రకారం, జియో మరియు ఎయిర్టెల్ ధర పెంపును ప్రకటించాయి గనుక, తర్వాత వొడాఫోన్-ఐడియా కూడా టెలీకామ్ ట్యారిఫ్ పెంచుతుందని అంచనా. అయితే దీనికి సంబంధించి వీఐ నుంచి ఎటువంటి అధికార ప్రకటన ఇంకా వెలువడలేదు.

25 శాతం మేర ధరలు పెంచిన జియో

దేశంలోని ప్రముఖ టెలీకామ్ సంస్థ రిలయన్స్ జియో తమ రీచార్జ్ ప్లాన్స్ ధరలను భారీగా పెంచింది. రీచార్జ్ ప్లాన్ల ధరలు 15 నుంచి 25 శాతం వరకు పెరుగుతాయని జియో ప్రకటించింది. జులై 3వ తేదీ నుంచి పెరిగిన ధరలు అమలులోకి వస్తాయని జియో తెలిపింది.