తక్కువ బడ్జెట్ లో స్మార్ట్ఫోన్లను అందిస్తూ జనాల్లో మంచి పేరు సంపాదించిన Tecno సంస్థ నేడు భారతీయ మార్కెట్ లో Tecno Spark 20 స్మార్ట్ఫోన్ ని లాంచ్ చేసింది. మెమొరీ ఫ్యూజన్ టెక్నాలజీతో వచ్చిన ఈ ఫోన్ 16జిబి ర్యామ్ పవర్ ని ఆఫర్ చేస్తుంది. ఇంకా ఈ ఫోన్ లో 50ఎంపి మెయిన్ కెమెరా, 32ఎంపి సెల్ఫీ కెమెరా, 256జిబి స్టోరేజీ వంటి స్పెసిఫికేషన్స్ తో వచ్చింది. సరే, ఓసారి Tecno Spark 20 యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్ మరియు ధర తదితర వివరాలు తెలుసుకుందాం పదండి.
Tecno Spark 20 ధర, సేల్
- Tecno Spark 20 డివైజ్ 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ సింగిల్ వేరియంట్ లో లాంచ్ అయ్యింది.
- Tecno Spark 20 ధరను భారత్ లో రూ.10,499 గా నిర్ణయించారు. Tecno Spark 20 డివైజ్ బ్లాక్, గోల్డ్, వైట్ మరియు బ్లూ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.
- Tecno Spark 20 స్మార్ట్ఫోన్ ని అమెజాన్ ద్వారా ఫిబ్రవరి 2 నుంచి కొనుగోలు చేయవచ్చు.
- Tecno Spark 20 ఫోన్ కొనుగోలు చేసే వారికి రూ.4,897 విలువగల ఓటీటీ ప్లే ప్రీమియమ్ సబ్స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది. 19 ఓటీటీ యాప్స్ కంటెంట్ ని ఈ సబ్స్క్రిప్షన్ పై ఎంజాయ్ చేయవచ్చు.
Tecno Spark 20 స్పెసిఫికేషన్స్
- డిస్ప్లే: Tecno Spark 20 లో 6.6-ఇంచ్ హెచ్డీ+ స్క్రీన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, పంచ్ హోల్ కటౌట్ ఉన్నాయి.
- ప్రాసెసర్: Tecno Spark 20 లో మీడియాటెక్ హీలియో జీ85 చిప్సెట్ వాడారు. ఇది 12 నానోమీటర్ ప్రాసెస్ పై తయారైంది. ఈ చిప్ మాగ్జిమమ్ క్లాక్ స్పీడ్ 2.0 గిగాహెర్ట్జ్.
- ర్యామ్, స్టోరేజీ: Tecno Spark 20 లో 8జిబి ర్యామ్, 8జిబి వర్చువల్ ర్యామ్ ఉన్నాయి. దీంతో యూజర్ కి గరిష్టంగా 16జిబి ర్యామ్ పవర్ లభిస్తుంది. ఈ ఫోన్ లో 256జిబి స్టోరేజీ ఇచ్చారు. మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో మెమొరీని 1టిబి వరకు పెంచుకునే వీలుంది.
- కెమెరా: Tecno Spark 20 లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, ఏఐ సెకండరీ లెన్స్, ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.
- బ్యాటరీ: Tecno Spark 20 లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 10 వాట్ ఛార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
- ఇతర ఫీచర్లు: Tecno Spark 20 లో డ్యూయల్ సిమ్, 4జీ, వై-ఫై, బ్లూటూత్, ఐపీ53 రేటింగ్, డ్యూయల్ డీటీఎస్ స్పీకర్ ఉన్నాయి.