‘మార్షియన్ హరైజన్’ డిజైన్‌తో వస్తోన్న Realme Narzo 60 సిరీస్; జులై 6న భారత్ లో లాంచ్!

Highlights

  • జులై 6 న భారత్‌లో లాంచ్ కానున్న Narzo 60, Narzo 60 Pro
  • 100ఎంపి మెయిన్ కెమెరాతో వస్తోన్న డివైజ్
  • అమెజాన్ లో కనిపిస్తోన్న Realme Narzo 60 టీజర్

రియల్మీ సంస్థ కొన్ని రోజుల నుంచి భారత్ లో కొత్త నార్జో సిరీస్ లాంచ్ ని టీజ్ చేస్తూ వస్తోంది. కొత్త స్మార్ట్ ఫోన్ సిరీస్ Realme Narzo 60 5G సిరీస్ అని వార్తలు వినిపిస్తున్నాయి. Narzo 50 సిరీస్ కి సక్సెసర్ గా Narzo 60 సిరీస్ మార్కెట్ లోకి వస్తోంది. జులై 6 న నార్జో 60 5జీ, నార్జో 60 ప్రో డివైజెస్ భారత్ లో లాంచ్ కానున్నట్లు రియల్మీ సంస్థ అధికారికంగా ప్రకటించింది.

Realme Narzo 60 5G సిరీస్ డిజైన్ వివరాలు

  • రియల్మీ నుంచి రాబోవు స్మార్ట్ ఫోన్ Realme Narzo 60 5G సిరీస్ అని తెలుస్తోంది. తాజాగా ఈ సిరీస్ ఫోన్ ఫస్ట్ లుక్ తో పాటు లాంచ్ తేదీ రివీల్ అయ్యింది.
  • చూడటంతోనే, ఈ ఫోన్ Realme 11 Pro మాదిరి కనిపించింది. ఈ సిరీస్ ఇటీవలె భారత్ లో లాంచ్ అయ్యింది.
  • Realme Narzo 60 5G డివైజ్ ఆరెంజ్ కలర్ లో కనిపిస్తోంది. దీన్ని కంపెనీ Martian Horizon (మార్షియన్ హారిజన్) అని పిలుస్తోంది. మార్స్ గ్రహంపై నేలను స్పూర్తిగా తీసుకుని ఈ ఫోన్ కి రంగుని అందించారు. అమెజాన్ లో టీజర్ పేజీపై కూడా ఇదే విషయం స్పష్టమైంది.
  • అలాగే వెగాన్ లెదర్ ఫినిషింగ్ ని ఈ ఫోన్ కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. ఇంకా వాల్యూమ్ రాకర్, వాల్యూమ్ బటన్స్ ఫోన్ కి కుడివైపున ఉన్నాయి.
  • Realme Narzo 60 5G స్మార్ట్ ఫోన్ ప్రీమియమ్ లుక్ ని కలిగి, గత మోడల్ కంటే మెరుగ్గా ఉంది. ఈ ఫోన్ కర్వ్డ్ డిస్ప్లేతో వస్తున్నట్లు అమెజాన్ లో ఉన్న టీజర్ ద్వారా తెలుస్తోంది.

Realme Narzo 60 5G గురించి ఇప్పటి వరకు తెలిసిన వివరాలు

  • అమెజాన్ వెబ్ సైట్ లో ఉన్న టీజర్ పేజీ ప్రకారం, Realme Narzo 60 5G డివైజ్ కర్వ్డ్ డిస్ప్లే, 61-డిగ్రీ కర్వేచర్ ని కలిగి ఉంది.
  • ఈ స్మార్ట్ ఫోన్ లో పంచ్-హోల్ డిస్ప్లే ఉంది. టాప్ సెంటర్ లో సెల్ఫీ కెమెరా ఉంది.
  • Realme Narzo 60 5G స్మార్ట్ ఫోన్ 1టిబి స్టోరేజీతో వస్తున్నట్లు సమాచారం. టాప్ స్టోరేజీ వేరియంట్ లో 250,000 ఫోటోలను స్టోర్ చేసుకోవచ్చని రియల్మీ కంపెనీ టీజర్ ద్వారా తెలిపింది.

Realme Narzo 60 5G సిరీస్ లాంచ్ కి సంబంధించి రియల్మీ సంస్థ ప్రకటనతో నార్జో ఫ్యాన్స్ కోలాహలం నెలకొంది. బడ్జెట్ లో అన్ని ముఖ్యమైన ఫీచర్లను నార్జో సిరీస్ ఫోన్ల ద్వారా యూజర్లకు రియల్మీ అందిస్తూ వస్తోంది. దీంతో యూజర్లలో నార్జో సిరీస్ పట్ల ఆదరణ పెరిగింది. ఈ తరుణంలో Realme Narzo 60 5G సిరీస్ నుంచి వస్తోన్న రెండు ఫోన్లు ఏమేరకు యూజర్లను ఆకట్టుకుంటాయో చూడాలి.

Previous articleరూ.7,000 కంటే తక్కువ ధరతో భారత్‌లో లాంచ్ కానున్న itel A60S
Next articleలాంచ్‌కి ముందు గీక్‌బెంచ్ పై కనిపించిన OPPO Reno 10 5G
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.