OPPO: 67W ఫాస్ట్ చార్జింగ్‌తో చైనాలో లాంచైన A3 Pro

Highlights

  • OPPO A3 Pro చైనాలో లాంచ్
  • ఐపీ69 రేటింగ్
  • 64ఎంపి కెమెరా

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO తాజాగా చైనాలో ఒక కొత్త ఏ-సిరీస్ ఫోన్‌ని లాంచ్ చేసింది. OPPO A3 Pro పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి వచ్చింది. OPPO A3 Pro లో 24జిబి ర్యామ్ (12జిబి+12జిబి), మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్సెట్, 64ఎంపి కెమెరా, 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్, ఐపీ69 రేటింగ్ ఉన్నాయి. ఓసారి పూర్తి స్పెసిఫికేషన్స్ మరియు ధర వివరాలు తెలుసుకుందాం.

OPPO A3 Pro 5G ధర, కలర్ ఆప్షన్స్

OPPO A3 Pro 5G స్మార్ట్‌ఫోన్ యొక్క 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధర 1999 యువాన్లు (సుమారు రూ.23,500) గా ఉంది.

OPPO A3 Pro 5G 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర 2199 యువాన్లు (సుమారు రూ.25,900) గా ఉంది.

OPPO A3 Pro 5G 12జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ మోడల్ ధర 2499 యువాన్లు (సుమారు రూ.29,000) గా ఉంది.

OPPO A3 Pro 5G డివైజ్ అజూర్, పింక్ మరియు బ్లూ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

OPPO A3 Pro 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: OPPO A3 Pro 5G లో 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ స్క్రీన్, 2412*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, ఓఎల్ఈడీ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.

ప్రాసెసర్: OPPO A3 Pro 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్సెట్ వాడారు. ఇది 6 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది. గ్రాఫిక్స్ కోసం మాలి జీ68 జీపీయూ ఉపయోగించారు.

ర్యామ్, స్టోరేజీ: OPPO A3 Pro 5G డివైజ్ 8జిబి ర్యామ్/12జిబి ర్యామ్ + 256జిబి/512జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. 12జిబి వర్చువల్ ర్యామ్ ఫీచర్ ని ఈ ఫోన్ లో అందించారు.

కెమెరా: OPPO A3 Pro 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 64ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి పొట్రెయిట్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

బ్యాటరీ: OPPO A3 Pro 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

Previous articleRealme P1 Pro 5G గీక్‌బెంచ్ లిస్టింగ్ వివరాలు
Next articleiQOO: లీకైన Neo 9s Pro ప్రధాన స్పెసిఫికేషన్స్, ధర వివరాలు
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.