HMD: త్వరలో లాంచ్ కానున్న 9 HMD ఫోన్లు, ఐఎంఈఐ డేటాబేస్ పై లిస్టైన డివైజెస్!

Highlights

  • త్వరలో లాంచ్ కానున్న హెచ్ఎండి ఫోన్లు
  • ఒకేసారి 9 ఫోన్లు లాంచ్ అయ్యే అవకాశం
  • ఐఎంఈఐ పై లిస్టైన డివైజెస్

HMD సంస్థ త్వరలో స్మార్ట్‌ఫోన్ మార్కెట్ లో తనదైన ముద్ర వేసేందుకు సిద్ధమవుతోంది. మొదటి దశలో HMD నుంచి 3 స్మార్ట్‌ఫోన్లు లాంచ్ కానున్నట్లు 91mobiles కి సమాచారం అందింది. మరోవైపు కొత్త వార్త ఒకటి బయటకు వచ్చింది. దాని ప్రకారం HMD కంపెనీ ఒకట్రెండు ఫోన్లు కాదు, చాలా ఫోన్లను ఒకేసారి లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. తాజాగా 9 HMD స్మార్ట్‌ఫోన్లు ఐఎంఈఐ డేటాబేస్ పై లిస్ట్ అయ్యాయి.

త్వరలో లాంచ్ కానున్న 9 HMD స్మార్ట్‌ఫోన్లు

  • HMD సంస్థ ప్రస్తుతం 11 ఉత్పత్తులపై పని చేస్తున్నట్లు GSMChina తన కథనం ద్వారా వెల్లడించింది. అయితే తాజాగా ఐఎంఈఐ డేటాబేస్ పై 9 డివైజెస్ లిస్ట్ అయ్యాయి.
  • HMD బ్రాండ్ కి చెందిన TA-1584, TA-1588, TA-1589, TA-1592, TA-1594, TA-1595, TA-1602, TA-1605 మరియు TA-1631 డివైజెస్ ఐఎంఈఐ డేటాబేస్ పై లిస్ట్ అయ్యాయి.
  • HMD బ్రాండ్ కి చెందిన కొత్త ఫోన్ వివరాలు ఇంకా తెలియలేదు. కానీ, గతంలో వచ్చిన సమాచారాన్ని బట్టి, HMD ఫోన్ 108ఎంపి ఓఐఎస్ ట్రిపుల్ కెమెరా సెటప్ తో వస్తున్నట్లు తెలుస్తోంది.
  • వచ్చే నెల జరగనున్న మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ ఈవెంట్ లో HMD ఫోన్లు లాంచ్ అవుతాయని అంచనా వేస్తున్నారు.

HMD చేయబోయేదేంటి?

  • HMD గ్లోబల్ సంస్థ వద్ద Nokia లైసెన్స్ వ్యవధి 2026 వరకు ఉంది. మాకు అందిన సమాచారం ప్రకారం, HMD కంపెనీ రానున్న రోజుల్లో నోకియా మరియు HMD పేర్లతో ఫోన్లను లాంచ్ చేయనుంది.
  • 2024 లో లాంచ్ కాబోయే Nokia ఫోన్లు ఆఫ్-లైన్ మార్కెట్ లో అందుబాటులో ఉంటాయి. మరోవైపు, HMD బ్రాండ్ ఫోన్లు ఆన్‌లైన్ మార్కెట్ మరియు ప్రముఖ రిటైల్ స్టోర్స్ లో అందుబాటులో ఉంటాయి.
  • ఈ ఆఫ్‌లైన్ మరియు ఆన్‌లైన్ స్ట్రేటజీ వల్లన ఫోన్ల యొక్క ధరలపై కూడా ప్రభావం ఉంటుంది.
  • ఆన్‌లైన్ లో లభించే హెచ్ఎండీ ఫోన్లు సరసమైన ధరలకు లభించగా, ఆఫ్‌లైన్ మార్కెట్ లో లభించే నోకియా ఫోన్లు కాస్త ఖరీదైనవిగా ఉంటాయి.