రూ.20,000 లోపు ధరలో లభించే 33W ఫాస్ట్ చార్జింగ్‌ సపోర్ట్ కలిగిన స్మార్ట్ ఫోన్స్

Highlights

  • మొబైల్ స్పెసిఫికేషన్స్ లో ఫాస్ట్ చార్జింగ్ కి జనాల్లో అధిక ప్రాధాన్యత
  • విభిన్న చార్జింగ్ స్పీడ్స్ తో లభిస్తోన్న స్మార్ట్ ఫోన్లు
  • 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ కలిగిన రూ.20,000 లోపు ధర కల్గిన ఫోన్ల జాబితా మీకోసం

స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటే సరిపోదండి. అందులో పవర్ ఉండాలి. పవర్ ఉండాలంటే చక్కటి బ్యాటరీ ఉండాలి. అంతేకాదు బ్యాటరీని త్వరగా చార్జ్ చేసే చార్జింగ్ టెక్నాలజీకి ఫోన్ సపోర్ట్ చేయాలి. అప్పుడే త్వరగా బ్యాటరీని చార్జ్ చేసే అవకాశం ఉంటుంది. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ఫోన్ చార్జింగ్ కోసం గంటల తరబడి వేచి చూసే పరిస్థితి లేదు. అందుకే ఫోన్ ని వీలైనంత త్వరగా చార్జ్ చేస్తే ఒక పెద్ద పని అయిపోయినట్లే.

మరి ఫోన్ ని త్వరగా చార్జ్ చేయాలంటే మంచి వాటేజీ కల్గిన ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీ ఆ ఫోన్ లో ఉండాలి. వివిధ చార్జింగ్ స్పీడ్స్ కి సపోర్ట్ చేసే ఫోన్లు మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి. చార్జింగ్ కెపాసిటీని బట్టి ఆయా ఫోన్ల ధరలు ఉంటాయి. ఈ ఆర్టికల్ లో మనం 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేసే ఫోన్ల జాబితాను తెలుసుకుందాం.

రూ.20,000 లోపు ధరలో లభించే 33W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ కలిగిన స్మార్ట్‌ఫోన్లు

  • OPPO K10
  • Realme 8s 5G
  • Motorola G72
  • OPPO A78 5G
  • Redmi Note 11
  • Realme Narzo 50
  • Redmi Note 11T 5G
  • Redmi Note 12 5G
  • Tecno POVA 3
  • Redmi Note 10S

1. OPPO K10

ఒప్పో కే10 స్మార్ట్ ఫోన్ 33వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఈ డివైజ్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 6జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 480 చిప్సెట్, 50ఎంపి ఏఐ ట్రిపుల్ మెయిన్ కెమెరా, 16ఎంపి సెల్ఫీ కెమెరా, 6.59-ఇంచ్ 90 హెర్ట్జ్ ఫుల్ హెచ్డీ డిస్ప్లే, 4జీ కనెక్టివిటీ వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఈ ఫోన్ 6జిబి ర్యామ్ వేరియంట్ ధర రూ.18,999.

2. Realme 8s 5G

రియల్మీ 8ఎస్ 5జీ స్మార్ట్ ఫోన్ 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఈ డివైజ్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 64ఎంపి + 2ఎంపి + 2ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరా, 16ఎంపి ఫ్రంట్ కెమెరా, 6.5-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ ఎల్సీడీ డిస్ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 810 చిప్సెట్ వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఈ ఫోన్ 6జిబి ర్యామ్ మోడల్ ధర రూ.17,999.

3. Motorola G72

ఈ స్మార్ట్ ఫోన్ 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ కలిగి ఉంది. ఈ డివైజ్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఈ ఫోన్ లో మీడియాటెక్ హీలియో జీ99 చిప్సెట్, 108ఎంపి మెయిన్ కెమెరా, 6.55-ఇంచ్ 10-బిట్ ఫుల్ హెచ్డీ+ పీఓఎల్ఈడీ 120 హెర్ట్జ్ డిస్ప్లే వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఈ ఫోన్ ధర రూ.16,999.

4. OPPO A78 5G

ఒప్పో ఏ78 5జీ స్మార్ట్ ఫోన్ 33 వాట్ సూపర్ వూక్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఈ ఫోన్ ధర రూ.18,999.

5. Redmi Note 11

ఈ డివైజ్ 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ లో 4జిబి ర్యామ్, 64జిబి స్టోరేజీ, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 680 చిప్సెట్ వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఈ ఫోన్ ధర రూ.12,999.

6. Realme Narzo 50

రియల్మీ నార్జో 50 ఫోన్ 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ లో 4జిబి ర్యామ్, 64జిబి స్టోరేజీ, 50ఎంపి ఏఐ ట్రిపుల్ రియర్ కెమెరా, మీడియాటెక్ హీలియో జీ96 ప్రాసెసర్, 120 హెర్ట్జ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఈ ఫోన్ ధర రూ.10,499.

7. Redmi Note 11T 5G

రెడ్మీ నోట్ 11టీ 5జీ స్మార్ట్ ఫోన్ 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, డైమెన్సిటీ 810 5జీ చిప్సెట్, 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ, 50ఎంపి ప్రైమరీ కెమెరా, 16ఎంపి ఫ్రంట్ కెమెరా వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఈ ఫోన్ ధర రూ.18,499.

8. Redmi Note 12 5G

ఈ ఫోన్ 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, స్నాప్ డ్రాగన్ 4 జెన్ 1 చిప్సెట్, 48ఎంపి ఏఐ ట్రిపుల్ కెమెరా, సూపర్ అమోలెడ్ డిస్ప్లే వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఈ ఫోన్ ధర రూ.17,999.

9. Tecno POVA 3

టెక్నో పోవా 3 ఫోన్ 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ లో 4జిబి ర్యామ్, 64జిబి స్టోరేజీ, 7000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఈ ఫోన్ ధర రూ.10,299.

10. Redmi Note 10S

ఈ డివైజ్ 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ లో 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ, సూపర్ అమోలెడ్ డిస్ప్లే, 64ఎంపి క్వాడ్ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, మీడియాటెక్ హీలియో జీ95 చిప్సెట్ వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఈ ఫోన్ ధర రూ.18,499.

11. POCO X5 5G

పోకో ఎక్స్5 5జీ ఫోన్ 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఈ డివైజ్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 6జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 చిప్సెట్, 48ఎంపి + 8ఎంపి + 2ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరా, 13ఎంపి ఫ్రంట్ కెమెరా, 6.67-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ సూపర్ అమోలెడ్ డిస్ప్లే వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఈ ఫోన్ 6జిబి ర్యామ్ వేరియంట్ ధర రూ.17,999.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.